ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం

ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం

ఎండాకాలం.. ఎండలకు స్మాల్ బ్రేక్ ఇస్తూ వర్షాలు పడటం కామన్.. ఇది ప్రతి ఏటా జరుగుతుంది.. 2024 ఎండాకాలంలోనూ ఇదే జరిగింది. 2024, మే 7వ తేదీ సాయంత్రం హైదరాబాద్ సిటీ మొత్తం భారీ వర్షం పడింది.. అది మామూలు వర్షం అయితే పర్వాలేదు.. కానీ బీభత్సమైన కుండపోత వర్షం పడింది.. జస్ట్ మూడు అంటే మూడు గంటల్లో.. 10 సెంటీమీటర్ల వరకు వర్షం పడటంతో.. రోడ్లు జలమయం అయ్యాయి.. కాలనీల్లోని నీళ్లు వచ్చాయి.. చెట్లు కూలాయి.. కరెంట్ కట్ అయ్యింది.

ఈసారి వర్షం బీభత్సం చేసేసింది. శేరిలింగంపల్లిలో అత్యధికంగా 10.8 సెంటీమీటర్ల వర్షం పడగా.. ఆ తర్వాత కూకట్ పల్లిలో 7.8 సెంటీమీటర్ల వాన పడింది.  మియాపూర్‌లో గడిచిన 2 గంటల్లో 10.8 సెంటీమీటర్ల వర్షం నమోదైంది.  ఉత్తర హైదరాబాద్ లో మొత్తం 40మిల్లీ మీటర్ల  వర్షపాతం నమోదైంది. అల్వాల్ లో  7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా హైదరాబాద్  వాతావరణ శాఖ వెల్లడించింది. 

 

  • మూసాపేట్ లో అత్యధికంగా 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు..
  • మియాపూర్ లో 10.8 సెంటీమీటర్లు..
  • చందానగర్ లో 10.7 సెంటీమీటర్లు..
  • లింగంపల్లిలో 9.9 సెంటీమీటర్లు..
  • గచ్చిబౌలిలో 9.5 సెంటీమీటర్లు..
  • కృష్ణానగర్లో 9.4 సెంటీమీటర్లు..
  • ఆర్సిపురంలో 8.8 సెంటీమీటర్లు..
  • జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ దగ్గర 8.4 సెంటీమీటర్లు..
  • ఖైరతాబాద్ లో 7.7 సెంటీమీటర్లు..
  • బోరబండలో 6.8 సెంటీమీటర్లు..
  • ఆదర్శనగర్ లో 6.6 సెంటీమీటర్లు..
  • గాజుల రామారావు లో 6.4 సెంటీమీటర్లు..
  • కూకట్పల్లిలో 5.7 సెంటీమీటర్లు..
  • బీహెచ్ఈఎల్ వద్ద 5.3 సెంటీమీటర్లు..
  • విజయనగర్ కాలనీ లో 4.3 సెంటీమీటర్లు