SRH vs LSG: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు.. మ్యాచ్ జరిగేది అనుమానమే

SRH vs LSG: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు.. మ్యాచ్ జరిగేది అనుమానమే

ఐపీఎల్ లో ప్లే ఆఫ్ కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాక్ తగిలే అవకాశముంది. ఉప్పల్ వేదికగా రేపు (మే 8)లక్నో సూపర్ జయింట్స్ తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. హైదరాబాద్ లో ప్రస్తుతం కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు (మే 7) వరుణుడు విజృంభిస్తున్నాడు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి.

ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో  లక్నో ఆటగాళ్ల ప్రాక్టీస్ చేస్తున్నసమయంలో చిరు జల్లులు కురిశాయి. దీంతో ఆటగాళ్లు ప్రాక్టీస్ ఆపేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొంత సేపటికీ భారీ వర్షం కురవడంతో గ్రౌండ్ అంతటా కవర్స్ కప్పి ఉంచారు. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. రెండు జట్లు కూడా ఆడిన 11 మ్యాచ్ ల్లో 6 విజయాలు సాధించి రేస్ లో ఉన్నాయి. ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు.