సంపదలో జుకర్‌‌‌‌బర్గ్‌‌ను దాటిన ఎలన్‌‌ మస్క్‌‌

సంపదలో జుకర్‌‌‌‌బర్గ్‌‌ను దాటిన ఎలన్‌‌ మస్క్‌‌

న్యూఢిల్లీ: ప్రపంచంలో మూడో అత్యంత ధనవంతుడిగా టెస్లా సీఈఓ ఎలన్‌‌ మస్క్‌‌ నిలిచారు. యూఎస్‌‌ మార్కెట్లో టెస్లా షేర్లు  లాభపడడంతో  ఎలన్ మస్క్‌‌ సంపద 115.4 బిలియన్‌‌ డాలర్లను దాటింది. దీంతో బ్లూమ్‌‌బర్గ్‌‌ బిలియనీర్‌‌‌‌ ఇండెక్స్‌‌లో ఫేస్‌‌బుక్ జుకర్‌‌‌‌ బర్గ్‌‌ను ఎలన్‌‌  అధిగమించారు.  ప్రస్తుతం జుకర్‌‌‌‌ బర్గ్‌‌ సంపద 110.8 బిలియన్‌‌ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది టెస్లా షేర్లు ఏకంగా 500 శాతం పెరగడంతో, ఎలన్ మస్క్ సంపద 87.8 బిలియన్‌‌ డాలర్లు ఎగిసింది. దీంతో సెంటిబిలియనీర్‌‌‌‌(100 బిలియన్‌‌ డాలర్లు) క్లబ్‌‌లో జుకర్‌‌‌‌బర్గ్‌‌, బెజోస్‌‌, బిల్‌‌గేట్స్‌‌లతో ఎలన్‌‌ మస్క్‌‌ జాయిన్‌‌ అయ్యారు.

జూమ్‌‌..జూమ్‌‌ జూమ్‌‌

క్వార్టర్లీ రిజల్ట్స్‌‌ బాగుండడంతో అమెరికన్‌‌ మార్కెట్లో వీడియో కాన్ఫరెన్సింగ్‌‌ యాప్‌‌ జూమ్‌‌ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. సోమవారం సెషన్‌‌లో ఈ కంపెనీ షేర్లు ఏకంగా 26 శాతం పెరిగాయి. దీంతో జూమ్‌‌ సీఈఓ ఎరిక్ యువాన్‌‌ సంపద 4.2 బిలియన్‌‌ డాలర్లు పెరగడంతో, ఆయన సంపద 12.8 బిలియన్‌‌ డాలర్లకు చేరుకుంది.  కాగా, కరోనా సంక్షోభంతో జూమ్‌‌కు భారీగా డిమాండ్‌‌ పెరిగింది. ఏప్రిల్‌‌–జూన్‌‌ క్వార్టర్‌‌‌‌లో జూమ్‌‌ సేల్స్‌‌ ఏకంగా 355 శాతం పెరిగి 663.5 మిలియన్‌‌ డాలర్లకు చేరాయి.