ఈక్వాలిటీ, రెస్పెక్ట్ కావాలి: డ్వేన్ బ్రావో

ఈక్వాలిటీ, రెస్పెక్ట్ కావాలి: డ్వేన్ బ్రావో

న్యూఢిల్లీ: యూఎస్‌లో ఆఫ్రికన్–అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ మృతితో బ్లాక్ లివ్స్ మ్యాటర్ అనే క్యాంపెయిన్ బాగా ప్రచారం అవుతోంది. దీంట్లో భాగంగా వెస్టిండీస్ క్రికెటర్లు డారెన్ సామీ, క్రిస్ గేల్ రేసిజం గురించి పలు వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్‌లో సన్ రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌కు ఆడిన టైమ్‌లో తనతోపాటు శ్రీలంక ఆల్‌రౌండర్ తిసార పెరీరా వర్ణ వివక్షతను ఎదుర్కొన్నామని డారెన్ సామీ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో విండీస్ ప్లేయర్ డ్వేన్ బ్రావో వర్ణ వివక్షతపై స్పందించాడు. తాను ప్రతీకారం కోసం చూడనని.. ఈక్వాలిటీ, రెస్పెక్ట్ కోసం నల్ల జాతీయులు డిమాండ్ చేయాల్సిన టైమ్ వచ్చిందని బ్రావో చెప్పాడు.

‘ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న విషయాలను చూస్తుంటే బాధేస్తోంది. ఓ బ్లాక్ మెన్‌గా నల్ల జాతీయుల ఘనత, వారి హిస్టరీ మాకు తెలుసు. మేం ఎప్పుడూ ప్రతీకారం తీర్చుకుంటామని అడగలేదు. సమానత్వం, గౌరవం కావాలని కోరుతున్నాం. మనం (నల్ల జాతీయులను ఉద్దేశించి) చాలా శక్తిమంతులం, బ్యూటిఫుల్ అని నా బ్రదర్స్, సిస్టర్స్‌ తెలుసుకోవాలి. నెల్సన్ మండేలా, మహ్మద్ అలీ, మైకేల్ జోర్డాన్‌ లాంటి గ్రేల్ లెజెండ్స్‌ మనకు మార్గాన్ని సుగమం చేశారు’ అని బ్రావో పేర్కొన్నాడు.