ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలె : సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలె : సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు

న్యూ ఇయర్ సందర్భంగా సైబరాబాద్ లో  ట్రాఫిక్ ఆంక్షలు విధించామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. సైబరాబాద్ పరిధిలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్ని ఫ్లై ఓవర్లు మూసివేస్తున్నామని స్పష్టం చేశారు. నెహ్రూ ఓఆర్ఆర్ పై కేవలం ఎయిర్ పోర్ట్ కు వెళ్లే  వెహికిల్స్ కు మాత్రమే అనుమతి ఉందని చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు రాత్రి 8 గంటల నుంచి జనవరి1 ఉదయం 5 గంటల వరకు చేస్తామన్నారు. మొత్తం 60 టీమ్స్ తో ఈ  తనిఖీలు చేస్తున్నామని తెలిపారు.

750 నుంచి 800మంది పోలీస్ సిబ్బందితో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ చెప్పారు. ట్రాఫిక్ రెగ్యులేషన్ లో 500మందిని పెట్టామని, డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడితే రూ.10వేల జరినామాతో  పాటు 6 నెలలు జైలు శిక్ష విధించబడుతుందన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్నీ మానిటరింగ్ చేస్తామన్న డీసీపీ... ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో భాగంగా ఎవరైనా తాగి న్యూసెన్స్ చేస్తే  కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.