కరోనా ఎఫెక్ట్: మందుల ఎగుమతి బంద్

కరోనా ఎఫెక్ట్: మందుల ఎగుమతి బంద్
  • సెజ్‌‌లు, ఈఓయూలకు కూడా ఎక్స్ పోర్ట్ బ్యాన్‌
  • ‌ దేశంలో మందుల కొరత రాకుండా చూసేందుకే

యాంటి మలేరియా మెడిసిన్స్‌‌ను స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్లతో (సెజ్‌‌) పాటు, ఎక్స్ పోర్ట్‌‌ ఓరియంటెడ్‌‌ యూనిట్ స్‌(ఈఓయూ) కూడా ఎగుమతి చేయకుండా నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. హైడ్రాక్సిక్లోరోక్విన్‌‌తో పాటు ఇతర యాంటిమలేరియా మెడిసిన్ల ఎగుమతులను ప్రభుత్వం మార్చి 25న నిషేధించిన విషయం తెలిసిందే. సెజ్‌‌, ఈఓ యూలకు మాత్రం ఎగుమతులకు అనుమతిచ్చారు. తాజా ఆరర్లతో ఎక్స్ పోర్ట్‌‌ ప్రమోషన్‌ ర్ట్‌‌ స్కీమ్‌ కిందకు వచ్చే ఏ షిప్‌‌మెంట్‌ అయినా సరే ఈ మెడిసిన్లను ఎగుమతి చేయడానికి వీలులేదు. కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతుండడంతో దేశంలో మెడిసిన్స్‌ కొరత లేకుండా చూసుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ‘ హైడ్రాక్సిక్లో రోక్విన్‌, దీని నుంచి తయారు చేసిన ఫార్ములేషన్స్‌ను సెజ్‌‌లు, ఈఓయూలు ఎక్స్‌పోర్ట్ చేయడాన్ని ఏ పరిస్థితులలో నైనా నిషేదిస్తున్నాం ’ అని డైరక్టరేట్ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌‌(డీజీఎఫ్‌టీ) ఓ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అంతేకాకుండా ఈ మెడిసిన్లను అడ్వాన్స్ పేమెంట్స్‌పై లేదా అడ్వాన్స్‌ ఆధరైజేషన్‌(ఏఏ) స్కీము కింద గాని ఎగుమతి చేయడాన్ని ప్రభుత్వం నిషేధించింది. సాధారణంగా సెజ్‌‌, ఈఓయూలపై ఎక్స్ పోర్ట్‌ బ్యాన్ ఉండదు. గతంలో ప్రభుత్వం కొన్ని రకాల ఏపీఐలపై ఎక్స్ పోర్ట్‌ బ్యాన్‌ను విధించింది. కానీ ఇది సెజ్‌‌లకు, ఈఓయూలకు వర్తింపజేయలేదు. ఏఏ స్కీమ్‌ కింద ఉన్న కంపెనీలకు కూడా ఎక్స్ పోర్ట్ బ్యాన్ నుంచి మినహాయింపు నిచ్చింది. కానీ తాజాగా విడుదల చేసిన ఆర్డర్ల ప్రకారం వీటన్నింటికి ఎక్స్ పోర్ట్ బ్యాన్ అమలవుతుంది. కరోనా వైరస్‌ చికిత్సలో హైడ్రాక్సిక్లోరిన్‌ మంచి ఫలితాలను ఇస్తుందని ఇండియన్‌ కౌన్సిల్‌ మెడికల్‌ రిసెర్చ్‌‌(ఐసీఎంఆర్‌) రికమండ్‌‌ చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.హైడ్రాక్సిక్లోరోక్విన్‌ కరోనా ట్రీట్‌మెంట్‌లో గేమ్‌ ఛేంజర్‌ అవుతుందని ట్రంప్‌‌ ప్రకటించిన తర్వాత వివిధ దేశాలు ఈ మెడిసిన్స్‌ ఎక్స్ పోర్టు ను నిషేధించాయి. కొన్ని వారాల కిందట మెడికల్‌ డివైజ్‌‌లు, శానిటైజర్లు, వెంటిలేటర్లు, సర్జికల్ మాస్కుల వంటి ప్రొడక్ట్స్‌ ఎగుమతులనూ ప్రభుత్వం బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే.