అబ్బో తమరికేదో సిక్స్ ప్యాక్ ఉన్నట్లు..వీరూ వడాపావ్ పై వివాదం

అబ్బో తమరికేదో సిక్స్ ప్యాక్ ఉన్నట్లు..వీరూ వడాపావ్ పై వివాదం

టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా అభిమానుల్ని అలరిస్తుంటారు. అయితే తాజాగా వీరూ చేసిన కామెంట్లు విమర్శలకు దారితీస్తున్నాయి.  ఐపీఎల్ – ‌‌2020 సందర్భంగా వీరేంద్రస్వేహ్వాగ్  వీరూకీ బైతక్ పేరుతో తన అభిప్రాయాన్ని సెటైరికల్ గా వీడియోస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ విషయాన్ని ప్రస్తావిస్తూ అతనో వడాపావ్ అని పిలిచాడు. అంతే సోషల్ మీడియాలో రోహిత్ అభిమానులు వీరూపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌కు తొడ కండరాల గాయం కారణంగా రోహిత్ శర్మ దూరమయ్యాడు. దాంతో కీరన్ పొలార్డ్ తాత్కలిక సారథిగా ముంబై జట్టును నడిపించి అద్భుత విజయాన్నందించాడు. ఈ మ్యాచ్‌పై తన షోలో మాట్లాడిన సెహ్వాగ్.. వడాపావ్‌లాంటి రోహిత్ శర్మ స్థానంలో సమోసాపావ్ వంటి సౌరభ్ వర్మ వచ్చాడన్నాడు. రోహిత్ ఆడలేదు.వడాపావ్‌కు గాయమైతే ఏం జరుగుతుంది. ఆ స్థానాన్ని సమోసా పావ్ తీసుకుంటుంది అని చెప్పుకొచ్చాడు.

ఈ వ్యాఖ్యలపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అబ్బో తమరికి సిక్స్ ప్యాక్ ఉన్నట్లే మాట్లాడుతున్నారు కదా అని ఒకరంటే..  ఒకరిని అనేముందు నీ లోపాలను సరిచూసుకో అని మరొకరు విమర్శించారు. సెహ్వాగ్‌ను విపరీతంగా అభిమానించేవాళ్లమని, కానీ అతని వ్యాఖ్యల పట్ల సిగ్గుపడుతున్నామని ఓ అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు.