యూపీ రైతుల నిరసన ర్యాలీ

యూపీ రైతుల నిరసన ర్యాలీ

నోయిడా: పంట రుణాల మాఫీ, కరెంటు చార్జీల తగ్గింపు కోసం యూపీలోని షహరాన్పూర్ నుంచి ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వరకు కాలినడకన ర్యాలీ చేపట్టిన  వందలాది మంది రైతులను శనివారం ఢిల్లీ–యూపీ బార్డర్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. రుణ మాఫీ, సాగుకు ఉచిత విద్యుత్, వడ్డీతో సహా చెరకు రైతులకు బకాయిల చెల్లింపులు, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు సహా 15 డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరుతున్నారు. కిసాన్ సంఘటన్ ఆధ్వర్యంలో  ఈ నెల 11 న షహరాన్పూర్ నుంచి రెండు వేల మందికి పైగా రైతులతో ప్రారంభమైన లాంగ్ మార్చ్ శనివారం నాటికి ఢిల్లీ–యూపీ బోర్డర్ కు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులంతా అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఢిల్లీలోని క్రిషి భవన్ లో అధికారులతో చర్చలు జరిపేందుకు రైతు ప్రతినిధుల బృందాన్ని అనుమతించినట్లు ఈస్ట్ రేంజ్ జాయింట్ కమిషనర్ అలోక్ కుమార్ చెప్పారు. అధికారులు తమ డిమాండ్లను అంగీకరిస్తేనే తాము అక్కడినుంచి వెనక్కి వెళ్లిపోతామని, లేదంటే నిరసన ర్యాలీ కొనసాగిస్తామని ఇండియన్ కిసాన్ సంఘటన్ ప్రకటించింది.

Farmers from UP march towards Delhi to protest over agri crisis, heavy security deployed