పరీక్షలు లేకుండానే ఫైనల్ ​గ్రేడ్.. HCU కీలక నిర్ణయం

పరీక్షలు లేకుండానే ఫైనల్ ​గ్రేడ్..  HCU కీలక నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: లాక్​డౌన్​లో​ఎగ్జామ్స్ నిర్వహించడం కష్టంగా మారడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, పీజీ ఫైనలియర్​స్టూడెంట్స్​కు లాస్ట్​సెమిస్టర్ నిర్వహించకుండానే ఫైనల్ గ్రేడ్స్​ఇవ్వనుంది. ప్రొఫెసర్లు ఇచ్చే గ్రేడింగ్ స్టూడెంట్స్​కు నచ్చకపోతే పరీక్ష రాసుకునే అవకాశమూ కల్పించింది. ఈ మేరకు హెచ్​సీయూ రివైజ్డ్​షెడ్యూల్ ను మంగళవారం​ప్రకటించింది. గత షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే ఎగ్జామ్స్ పూర్తి కావాల్సి ఉన్నా.. లాక్​డౌన్​ వల్ల వాయిదా పడ్డాయి. ఒకవేళ ఎగ్జామ్స్ నిర్వహించినా.. అన్ని రాష్ర్టాల నుంచి స్టూడెంట్స్ వర్సిటీకి రావడం కష్టమే. ఈ నేపథ్యంలో వర్సిటీ ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 16న డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్స్ ను వర్సిటీ ప్రకటించనుంది. దీనిపై అభ్యంతరాలు ఉన్న స్టూడెంట్స్ కు  జులై 4 నుంచి ఎగ్జామ్స్ రాసే అవకాశం ఇస్తుంది. ఆగస్టు 3 నుంచి11 వరకు ఫస్టియర్ స్డూడెంట్స్​కు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఆగస్టు 12 నుంచి వారికి నెక్ట్స్​సెమిస్టర్ క్లాసులు ప్రారంభించనున్నారు.

జగన్ కు ఐడియా ఇచ్చిందే కేసీఆరే