ఇక ఫ్లిప్ కార్ట్ లో సినిమాలు చూడొచ్చు

ఇక ఫ్లిప్ కార్ట్ లో సినిమాలు చూడొచ్చు

మార్కెట్లో పెరుగుతున్న పోటీని ఎదుర్కోవడానికి ఫ్లిప్ కార్ట్ మరో ముందడుగు వేసింది. షాపింగ్ యాప్ లో వీడియో ఆప్షన్ ను ప్రారంభించింది. అంటే ప్లిప్ కార్ట్ లో ఇకపై వీడియోలు కూడా చూసుకోవచ్చన్నమాట. అది ఎలా అంటే.ముందుగా లేటెస్ట్ ప్లిప్ కార్ట్ యాప్ ను  డౌన్ లోడ్ చేసుకుని అప్ డేట్ చేసుకుని ఓపెన్ చేయాలి. తర్వాత యాప్ కింద ఉన్న  వీడియో  ఆప్షన్ ను ఓపెన్ చేస్తే అందులో వీడియోలు కనిపిస్తాయి. అంతేగాకుండా సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా చూడటానికి ఆప్షన్లు ఇచ్చింది ఫ్లిప్ కార్ట్.