పాత సామాన్లు కొంటారట!

పాత సామాన్లు కొంటారట!

పనికిరాని డివైజ్​లు ఉన్నాయా? అయితే వాటిని ఫ్లిప్​ కార్ట్​కి అమ్మేయండి. అది స్మార్ట్​ ఫోన్లు, టీవీ, ఫ్రిజ్​, వాషింగ్​ మెషిన్, ల్యాప్​ట్యాప్ ఏదైనా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. లేదా పాతవాటిని అమ్మేయొచ్చు. పాడైన లేదా వాడని ఎలక్ట్రిక్ వస్తువులు చాలామంది దగ్గర ఉంటాయి. వాటిని పడేయలేక, ఏం చేయాలో తెలియక ఇంట్లోనే పెట్టుకుంటుంటారు. కానీ, ఇప్పుడు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరంలేదు. వాడకుండా పక్కన పెట్టిన వస్తువు ఏదైనా ఉంటే దాన్ని వెంటనే ఫ్లిప్​ కార్ట్​లో​ ఎక్స్ఛేంజ్ చేసుకునేలా ఫ్లిప్​ కార్ట్​ ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. అలాగే ఫోన్​, ల్యాప్​ట్యాప్​లలో ఉన్న డేటాను అప్ డేట్ లేదా డిలీట్ చేసే ముందు అందుకు అవసరమైన జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. 

కస్టమర్స్ బైబ్యాక్ ఆఫర్స్, అప్​గ్రేడ్ చేసిన ప్రొడక్ట్​లను హ్యాండ్ – ఇన్ –​ హ్యాండ్ ఎక్స్ఛేంజ్, నాన్ వర్కింగ్ అప్లయెన్స్​లను ఇంటికొచ్చి తీసుకెళ్తారు. వాటిని రీసైక్లింగ్ లేదా రీక్రియేట్ లేదా డిస్పోజబుల్ చేసే సంస్థలకు అమ్ముతారు. ఫ్లిప్ కార్ట్​ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఉన్న కారణం.. మనదేశంలో ఇ –వేస్ట్​ ప్రాబ్లమ్​ రోజురోజుకి పెరుగుతుండడమే. అందుకే ఇలా చేస్తే ఇ–వేస్ట్​ తగ్గుతుందని చెప్తోంది కంపెనీ.