సల్మాన్ ఇంటిపై కాల్పుల కేసు..నిందితుడి ఆత్మహత్య

సల్మాన్ ఇంటిపై కాల్పుల కేసు..నిందితుడి ఆత్మహత్య

న్యూఢిల్లీ : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులకు పాల్పడిన వ్యక్తి జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నిందితుల్లో ఒకరైన అనూజ్‌‌ తపన్‌‌ (32) పోలీసుల కస్టడీలో బలవనర్మణానికి పాల్పడ్డాడు. బుధవారం అనూజ్ బాత్రూమ్ కు వెళ్లి బెడ్ షీట్ తో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీనిని గమనించిన పోలీసులు వెంటనే అతడిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కాల్పుల ఘటనలో షూటర్లకు ఆయుధాలు అందించినట్టు అనూజ్‌‌పై ఆరోపణలు ఉన్నాయి. కాగా, సల్మాన్ ఖాన్ ఇంటిపై ఏప్రిల్ 14న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. సల్మాన్ నివసిస్తున్న గెలాక్సీ అపార్ట్ మెంట్ బయట ఇద్దరు వ్యక్తులు మూడు రౌండ్ల కాల్పులు జరిపిన విషయం తెలిసిందే!