ఆరు పనులతో ..అందలం ఎక్కొచ్చు​

ఆరు పనులతో ..అందలం ఎక్కొచ్చు​

మీ పనిలో ప్రొడక్టివిటీ బాగుండాలి అంటే... మీ కంటే తక్కువ ప్రొడక్టివిటీ కలిగిన వాళ్లను గమనించాలి. ఇలా ఎందుకంటే వాళ్లు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో తెలిస్తే. ఆ తప్పులు చేయకుండా మీ ప్రొడక్టివిటీని పెంచుకోవచ్చు. నిజానికి ఫైనాన్షియల్​ బ్లాగ్స్​ చాలావరకు కాంటెంపొరరీ సీఈఓల పని అలవాట్ల ​గురించి ఇంటర్వ్యూ చేస్తుంటాయి. అయితే వాళ్లు చెప్పే అంశాలు సామాన్యులకు స్ఫూర్తినివ్వవు. ఎందుకంటే వాళ్లలో చాలామంది ‘మెడిటేషన్​ చేస్తాం. ఇ–మెయిల్స్​ చూడం. వాటికి రిప్లయ్​ ఇవ్వం. అవే మా విజయానికి కారణం’ అని చెప్తుంటారు. 

కానీ సామాన్యుల జీవితాల్లో ఇలా ఉండడం సాధ్యమవుతుందా? ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసేంత టైం దొరకదు. ఎవరి ఇ–మెయిల్స్​ వాళ్లే చూసుకోవాలి. అంతేకానీ ఇ–మెయిల్స్​ చూసి, వాటికి రిప్లయ్​ ఇచ్చేందుకు అసిస్టెంట్​లు ఉండరు.  ‘మరయితే ప్రొడక్టివిటీ పెంచుకునే సజెషన్స్​ చెప్పి, మాలో స్ఫూర్తి కలిగేదెలా?’ అంటున్నారా. అందుకు ఉపయోగపడేదే ఐవీ లీ మెథడ్​. దీన్ని మోడర్న్​ పబ్లిక్​ రిలేషన్​ ఫౌండర్​ ఐవీ లీ అనే అమెరికన్​ తయారుచేశాడు. ఈ మోడల్​ తయారుచేసి వందేండ్లు అయినప్పటికీ ఇప్పటికీ లైవ్​గానే ఉంది. ఇకముందు కూడా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇన్నేండ్లయినా యాక్టివ్​గా పనిచేస్తున్న ఆ ప్రొడక్టివిటీ టూల్​ని ఆయన పేరుతోనే పిలుస్తారు. ఐవీ లీ పద్ధతి ఫాలో అయితే వర్క్​ ప్రొడక్టివిటీ పెరగడం ఖాయం. 

ఐవీ లీ పద్ధతి ఏంటి?

నా జీవితంలో ఏదైనా భిన్నంగా చేయాలి. అది అద్భుతంగా ఉండాలి. నా పేరు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. కానీ, ప్రతిరోజు షార్ట్​ టర్మ్​ గోల్స్​ పూర్తిచేయడంతోనే టైం అయిపోతుంది అనిపిస్తుంది. కానీ ఐవీ లీ మాత్రం ఆ పనులన్నింటినీ మేనేజ్​ చేశాడు. పెద్ద బిజినెస్​లు సక్సెస్​ సాధించేందుకు, ఎక్కువ ప్రొడక్టివిటీ కోసం 1920ల్లో ఒక పద్ధతి కనుగొన్నాడు. ఇందులో చేయాల్సిందల్లా చేయాల్సిన పనుల లిస్ట్​ను వాటి ప్రాధాన్యతలను బట్టి రాసుకోవాలి. ఆ లిస్ట్​లో ఉన్న పనులు పూర్తయ్యేవరకు వాటిని వదిలేయకుండా ఉండాలి.

ఇలా వాడాలి

ఈ పద్ధతి అంత కష్టమైనది కూడా కాదు. వర్కింగ్ డే అయిపోయేటప్పుడు రేపు చేయాల్సిన ఆరు టాస్క్​ల లిస్ట్​ రాయాలి. ఇది చదివాక వారానికి ఐదు రోజులు పనిచేసే వాళ్లు ‘శని, ఆదివారాలు సెలవులు కాబట్టి శుక్రవారం లిస్ట్​ చేయాల్సిన పనిలేదు’ అనుకోవచ్చు. కానీ అలా పనిచేసేవాళ్లు సోమవారం రోజు చేయాల్సిన ఆరు టాస్క్​ల లిస్ట్ శుక్రవారం రాయాలి.  ఐవీ లీ ప్రకారం వారాంతాలు అంటే శని, ఆదివారాల బ్రేక్​ తప్పనిసరి. అప్పుడే ఆ తరువాత చేసే పనిలో ప్రొడక్టివిటీ బాగుంటుంది అనేది ఆయన సిద్ధాంతం. 

అయితే అందులో కేవలం ఆరు టాస్క్​లు మాత్రమే రాయాలి.  అంతకంటే ఎక్కువ రాయొద్దు. అలాగే సాధ్యమైన పనులని మాత్రమే లిస్ట్​లో చేర్చుకోవాలి. అంతేకానీ ఎప్పటికీ పూర్తికాని లక్ష్యాలు పెట్టుకుని, వాటిని లిస్ట్​లో చేర్చడం వల్ల లాభం ఉండదు. లిస్ట్​ రాసుకున్న తరువాత వాటి ప్రాధాన్యతల బట్టి పని మొదలుపెట్టాలి. ముందు ఏ పని చేయాలి? అది ఎంత అత్యవసరం? అనేదాన్ని బట్టి చేసుకుంటూ వెళ్లడమే.


మరుసటిరోజు ఉదయం, అంతకుముందు రోజు రాసుకున్న లిస్ట్​ బట్టి పనులు మొదలుపెట్టాలి. మొదటి టాస్క్​తో పూర్తయ్యాకే రెండో టాస్క్​ తీసుకోవాలి. అలా ఆ రోజు ఆఫీసు టైం అయ్యే వరకు ఒకదాని తరువాత ఒకటి టాస్క్​ పూర్తి చేయాలి. ఒకే పని లేదా ప్రాజెక్ట్​ మీద కాన్​సన్​ట్రేట్​ చేస్తే ఫలితం బాగుంటుంది. ఆ రోజు పూర్తయ్యాక లిస్ట్​లో చేసుకున్న పనులేవైనా మిగిలిపోతే... వాటిని మరుసటి రోజు చేయాల్సిన పనుల లిస్ట్​లో చేర్చాలి. వాటితో పాటు కొత్త టాస్క్​లు చేర్చుకోవాలి. అయినా లిస్ట్​ మాత్రం ఆరుకి మించకూడదు.


టాస్క్​ల్లో ఒకదాని బదులు ఒకటి చేసినప్పటికీ అవి పూర్తి కావడం అనేది ముఖ్యం. ఒక పనిని పార్ట్స్​​గా చేసి పని పూర్తిచేయొచ్చు. ఉదాహరణకి క్వార్టర్​ రిపోర్ట్​ రాసేటప్పుడు దాన్ని చిన్న భాగాలుగా విభజించాలి. డాటా తీసుకుని దాన్ని విశ్లేషించి రిపోర్ట్​ రాయడం ఒక పని. దాన్ని ప్రెజెంటేషన్​గా తయారుచేయడం అనేది మరో టాస్క్​. దీన్ని ప్లానర్​, డిజిటల్​ నోట్​ లేదా క్యాలెండర్​గా చేయొచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ టాస్క్​లు పెట్టుకోవద్దు. వాటి ప్రాధాన్యతలను బట్టి లిస్ట్​ చేయాలి. ఒకవేళ ఆ టాస్క్​లు పూర్తికాకపోతే వాటిని వదిలేయొద్దు. మరుసటి రోజుకి ఆ టాస్క్​ని రోల్​ ఓవర్​ చేయాలి. కొత్తరోజుకి కలుస్తున్న కొత్త టాస్క్​లతో పాటు పాత వాటిని పూర్తి చేసేలా ప్లాన్​ చేసుకోవాలి. అప్పుడు కూడా చేయాల్సిన పనుల లిస్ట్​ మాత్రం ఆరుకి మించొద్దు.అయితే ఈ సూత్రం పనిలో ప్రొడక్టివిటీకే కాదు. వ్యక్తిగతంగా జీవితంలో ఎదగడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలా చేసుకుంటూ పోవడం వల్ల కళ్లముందు కనిపించే పనులు లేదా సమస్యలు భూతాల్లా భయపెట్టవు.

పబ్లిసిటీ ఎక్స్​పర్ట్​

ఐవీ లెడ్​బెట్టర్​ లీ అమెరికన్​ పబ్లిసిటీ ఎక్స్​పర్ట్​, మోడర్న్​ పబ్లిక్​ రిలేషన్​ ఫౌండర్​. జులై 16, 1877లో పుట్టిన ఈయన నవంబర్​ 9, 1934న న్యూయార్క్​లో చనిపోయాడు. ప్రిన్స్​టన్​ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్​ చేశాడు. న్యూయార్క్​ సిటీలో 1899 నుంచి 1903 వరకు న్యూస్​పేపర్​ రిపోర్టర్​గా పనిచేశాడు. కోల్​ మైనర్స్​ గ్రూప్​కి ప్రెస్​ రిప్రజెంటేటివ్​గా1906లో ఉన్నాడు. ఆ తరువాత 1912లో పెన్సిల్వేనియా రైల్​రోడ్​ కంపెనీని రిప్రజెంట్​ చేయడం మొదలుపెట్టాడు. 

ఆయన క్లయింట్​లకు పబ్లిక్​లో మంచి పేరు వచ్చేలా పనిచేసినందుకు ఇతని సర్వీస్​లను అప్పట్లో చాలా మేజర్​ కంపెనీలు తీసుకున్నాయి. 1917 వరకు ఐవీ దగ్గర పెద్ద క్లయింట్​లు వచ్చారు. వాళ్లో రాకెఫెల్లర్​ ఒకటి. ​రిపోర్టర్ల ప్రశ్నలకు ఐవీ లీ నిర్మొహమాటంగా జవాబు చెప్పేవాడు. అంతేకాకుండా  కంపెనీ డెవలప్​మెంట్స్​లో వార్తలకు పనికొచ్చే విషయాలను రిపోర్టర్లకి తెలియజేసేవాడు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్​ రెడ్ క్రాస్​ లీ క్లయింట్​ అయింది.