ఇలా ఉన్నారేంట్రా మీరు : అడవికి నిప్పుపెట్టి.. ఘనకార్యంగా రీల్స్

ఇలా ఉన్నారేంట్రా మీరు : అడవికి నిప్పుపెట్టి.. ఘనకార్యంగా రీల్స్

దేశ వ్యాప్తంగా ఆకతాయిలు పెరిగిపోతున్నారు.. ఒకడు మర్డర్ చేసి వీడియో తీసి రీల్ చేసి సోషల్ మీడియాలో పెడితే మరొకడు ఇంకో వింత పని చేసిన వీడియోను పెడుతున్నారు. ఇప్పుడు ఇంకో వ్యక్తి ఈ జాబితాలోకి వచ్చి చేరాడు. చిన్నా చితక పని చేస్తే ఏం మజా వస్తుందని అనుకున్నాడో ఏమో కానీ ఏకంగా అడవికే నిప్పుపెట్టాడు.. చేసింది మంచి ఘనకార్యమని వీడియో తీసి మరి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నేనే అడవిని తగలబెట్టా అని పొగరుగా మాట్లాడిన సన్నివేశం వైరల్ గా మారింది. ఇంతకు ఎక్కడంటే

ఉత్తరాఖండ్ లో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశం అయ్యింది.  "హలో అబ్బాయిలు, మేము చివరకు నిప్పు పెట్టే పని చేస్తున్నాము. మా పని నిప్పు పెట్టడం, నిప్పుతో ఆడుకోవడం. మేము అప్పుడప్పుడు నిప్పుతో ఆడుకుంటాము. మేము అదే పని చేయడానికి ఇక్కడకు వచ్చాము, మేము పర్వతాన్ని బూడిద చేస్తాము. నిప్పుతో ఆడుకునే వారిని ఎవరూ సవాలు చేయరు. బీహారీలకు ఎప్పుడూ సవాలు లేదు" అని చెప్పిన మాటలు వీడియోలో స్పష్టమౌతుంది. 

 బీంగ్‌సల్మాన్‌ఖాన్‌క్స్ 22 పర్వతం మొత్తానికి నిప్పు పెట్టినట్లు గర్వంగా అంగీకరించారు సదరు వ్యక్తులు, ఈ మొత్తం సన్నివేశాన్ని  రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. నెటిజన్స్ దీనిపై స్పందిస్తూ ఉత్తరాఖండ్ పోలీసులు దీనిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.