కూర్చున్న చోటికే చుక్క : ప్రారంభమైన లిక్కర్ హోం డెలివరీ సేవలు

కూర్చున్న చోటికే చుక్క : ప్రారంభమైన లిక్కర్ హోం డెలివరీ సేవలు

ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. లాక్ డౌన్ కారణంగా ఆర్ధికంగా నష్టపోయిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని భర్తీ చేసేందుకు మద్యం అమ్మకాలవైపు మొగ్గుచూపాయి. అయితే మద్యం కొనుగోలు చేయాలంటే కిలోమీటర్ల క్యూ తప్పడం లేదు. అనుకున్న ఆదాయం రావడం లేదు. సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడంతో కరోనా వైరస్ కేసులు పెరుగుతాయోనని భయం. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ఆయా రాష్ట్రాల ముఖ్య మంత్రులు మద్యం అమ్మకాల్లో టెక్నాలజీని జోడించారు.  ఆన్‌లైన్‌ ద్వారా ఇంటికే మద్యం హోం డెలివరీ సేవలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా జార్ఖండ్ ప్రభుత్వం రాంచీలో లిక్కర్  హోం డెలివరీ సేవల్ని ప్రారంభించింది. తొలిసారి రాంచీలో ప్రారంభమైన లిక్కర్  హోం డెలివరీలను రాబోయే రోజుల్లో జార్ఖండ్ లోని అన్నీ ప్రాంతాల్లో  ప్రారంభిచనున్నట్లు స్విగ్గీ వైస్ ప్రెసిడెంట్ రాతీ తెలిపారు. ఈ సందర్భంగా రాతీ మాట్లాడుతూ లిక్కర్ హోం డెలివరీ సేవల్లో భాగంగా ప్రభుత్వం నిబంధనల్ని విధించిందని,  ఆ నిబంధనలకు లోబడి మద్యాన్ని డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు