మాజీ సర్పంచ్‌‌‌‌‌‌‌‌లకు పెండింగ్‌‌‌‌‌‌‌‌ బిల్లులు చెల్లించాలి..ఆర్థిక సంఘం నిధులతో పాత బాకీలు కట్టాలి

మాజీ సర్పంచ్‌‌‌‌‌‌‌‌లకు పెండింగ్‌‌‌‌‌‌‌‌ బిల్లులు చెల్లించాలి..ఆర్థిక సంఘం నిధులతో పాత బాకీలు కట్టాలి

 

  •     మాజీ సర్పంచుల జేఏసీ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు : కేంద్రం నుంచి రాష్ట్రానికి విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధులను మాజీ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ల పెండింగ్‌‌‌‌‌‌‌‌ బిల్లుల చెల్లింపు కోసం వినియోగించాలని మాజీ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్రం రాష్ట్రానికి రూ.387 కోట్లను విడుదల చేసిందని, ఈ నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం సర్క్యులర్‌‌‌‌‌‌‌‌ జారీ చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో కేంద్రం విడతల వారీగా నిధులు ఇస్తోందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.1034.42 కోట్లు వచ్చాయని, ఇంకా రూ. 2 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం విడుదలైన రూ.387 కోట్లను దారి మళ్లించకుండా పదవీకాలం ముగిసినా, బిల్లులు రాక అప్పులపాలైన మాజీ సర్పంచులకే ఇవ్వాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ విషయంపై పంచాయతీ రాజ్‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. సమావేశంలో సర్పంచ్‌‌‌‌‌‌‌‌ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, కార్యదర్శి కేశబోయిన మల్లయ్య, సముద్రాల రమేశ్, నెక్కొండ రవి పాల్గొన్నారు.