డీలిమిటేషన్ పేరుతో కేంద్రం కుట్రపన్నుతుందని విమర్శించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ . సౌత్ లో బీజేపీకి బలం లేక కొత్త ఎత్తుగడ వేస్తోందన్నారు.ఓట్ బ్యాంక్ తో నార్త్ లో బలపడేలా ప్లాన్ చేస్తుందని చెప్పారు. సౌత్ స్టేట్స్ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి భారీగా నిధులు వెళ్తున్నాయని చెప్పారు. డీలిమిటేషన్ తో సౌత్ కు అన్యాయం జరుగుతోందన్నారు వంశీకృష్ణ.
దక్షిణాన బీజేపీపై పెరుగుతున్న వ్యతిరేకత దృష్ట్యా ఉత్తరాన సీట్లు పెంచుకొని మరోసారి అధికారం చేపట్టాలని డీలిమిటేషన్ పేరుతో కేంద్రం కుట్ర చేస్తోందని వంశీకృష్ణ అన్నారు. డీలిమిటేషన్ద్వారా అన్ని రాష్ట్రాలకు న్యాయంగా జరగాలని డిమాండ్ చేశారు. బీజేపీ సొంతలాభం కోసం డీలిమిటేషన్‌ను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోందని, దీనిపై పార్లమెంట్‌లో రాజ్యాంగబద్ధంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

