చండీగఢ్: భవిష్యత్ అంతా హైడ్రోజన్ దేనని ప్రధాని మోడీ అన్నారు. భవిష్యత్‌లో మరిన్నీ హైడ్రోజన్ రైళ్లు వస్తాయని తెలిపారు. హైడ్రోజన్ రైలు రైల్వే ట్రాక్ పై సరికొత్త విప్లవానికి నాందని పేర్కొన్నారు. రైల్వేలో డీజిల్, విద్యుత్ వినియోగం తగ్గిస్తామని చెప్పారు. శుక్రవారం (జులై 17) హార్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో భారత తొలి హైడ్రోజన్ రైలును ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కేవలం 3-4 దేశాలకు మాత్రమే హైడ్రోజన్ ఆధారిత రైలును నడిపే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదని.. అలాగే అత్యంత పొడవైనది తెలిపారు. ఈ రైలు 10 కోచ్‌లతో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తోందని చెప్పారు.
జింద్-సోనిపట్ మధ్య 89 కి.మీ దూరం ఈ ట్రైన్ ప్రయాణిస్తుందన్నారు. పర్యావరణరహిత ప్రాజెక్టులో భాగంగానే హైడ్రోజన్ రైలు తీసుకొచ్చామని తెలిపారు. హైడ్రోజన్ రైలుతో హర్యానా పేరు పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. భారతీయ రైల్వే రూపురేఖలు మార్చడంలో ఇది కీలకమైన ముందడుగని పేర్కొన్నారు.
ALSO READ : సోనం వాంగ్‌చుక్ దీక్షపై మౌనం వీడిన ఆమిర్ ఖాన్..
ఇండియా ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే:
జింద్, సోనిపట్ మధ్య నడవనున్న ఈ రైలు.. అత్యాధునిక హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. అంటే ఇది హైడ్రోజన్ను ఇంధనంగా వాడుకుని విద్యుత్తును తయారు చేస్తుంది. ఈ క్రమంలో కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. దీనివల్ల ఎటువంటి కాలుష్యం ఉండదు. డీజిల్ రైళ్లతో పోలిస్తే హైడ్రోజన్ రైలు తక్కువ శబ్దాన్ని చేస్తూ.. పర్యావరణహితంగా ప్రయాణాన్ని అందిస్తుంది. పది కోచ్ల సామర్థ్యం, 3,200 హార్స్ పవర్ శక్తి గల ఈ ఇంజిన్.. హైడ్రోజన్ రైలు రంగంలోనే అత్యంత శక్తిమంతమైన వాటిలో ఒకటిగా గుర్తింపు పొందింది.
