V6 News

జ్యోతిష్యం : గ్రహాల మార్పుతో ఈ 5 రాశుల వాళ్ల జీవితాల్లో ఊహించని మార్పులు..!

జ్యోతిష్యం : గ్రహాల మార్పుతో ఈ 5 రాశుల వాళ్ల జీవితాల్లో ఊహించని మార్పులు..!

గ్రహాల మార్పులు ఆసక్తి రేపుతోంది. ఏప్రిల్ నెల మధ్యలో జరుగుతున్న ఈ గ్రహాల మార్పుతో.. ఐదు రాశుల వాళ్ల జీవితాల్లో ఊహించని.. ఆకస్మిక జీవిత మార్పులు జరగబోతున్నట్లు జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. దీనికి కారణం శని, బుధుడు కలిసి ఉండటంతో చంద్రుడు వచ్చి చేరటంతో ఊహించని పరిణామాలు జరగొచ్చని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది. శని, బుధ, చంద్ర గ్రహాల కలయికతో.. రాబోయే 15 రోజుల.. తీసుకునే నిర్ణయాలు వేగంగా ఉండటం లేదా తీవ్రమైన భావోద్వేగాలకు గురి చేయటం వంటివి ఈ ఐదు రాశుల వాళ్లకు జరగొచ్చనేది సూచిస్తుంది. ఇంతకీ ఆ ఐదు రాశులు ఏంటీ.. వాళ్ల జీవితాల్లో వచ్చే మార్పులు ఏంటో తెలుసుకుందామా..

మేష రాశి :

ఉద్యోగం చేసే వాళ్లు ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగంలో ఇబ్బందులు రావొచ్చు లేదా కొత్త ఉద్యోగ అవకాశం లభించొచ్చు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు మళ్లీ మీ ముందుకు రావొచ్చు. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఓ సంఘటన జరిగే అవకాశం ఉండొచ్చని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది. 

మిథున రాశి :

మిథున రాశిపై బుధ గ్రహ సంచారం ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఓ ముఖ్య సమాచారం మీకు తెలిసే అవకాశం ఉంది. మీ రోజువారీ ప్రణాళికల్లో ఊహించని మార్పులు జరగొచ్చు. బంధువులు, స్నేహితుల మధ్య ఉన్న వివాదాలు లేదా అనుబంధాల విషయంలో మరింత స్పష్టత రావొచ్చని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది. 

కన్యా రాశి :

కన్యా రాశి వాళ్లకు ఉద్యోగం, డబ్బు విషయంలో ఊహించని మార్పులు జరగొచ్చని శాస్త్రం చెబుతోంది. ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్నట్లయితే.. ఆయా పనుల విషయంలో మార్పులు చోటుచేసుకోవచ్చు. కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని బాధ్యతల నుంచి మీరు తప్పుకునే విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం స్పష్టం చేస్తోంది. 

వృశ్చిక రాశి :

చంద్రుడు నీచంలో ఉండటం.. బుధ, శని గ్రహాల కలయికతో లోతైన భావోద్వేగాలకు గురవుతారు. అంతర్గత మార్పులను సూచిస్తుంది. గతంలో మిమ్మల్ని కాదనుకుని వెళ్లిన వాళ్లు.. మళ్లీ మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని నిర్ణయాలను దైర్యంగా తీసుకునే సమయం వచ్చిందని భావిస్తారు. పాత సంబంధాలు మళ్లీ చిగురించే అవకాశం ఉంది. మీలోని భావోద్వేగాన్ని కోపం లేదా చిరాకు రూపంలో ప్రదర్శించే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. 

కుంభ రాశి :

కుంభ రాశి జాతకులకు జీవితంలో అతి పెద్ద మార్పు సూచనలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలంగా ఉన్న సమస్య ఒకటి ఆకస్మికంగా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అన్నట్లు మీరు కొత్త మార్గంలో వెళ్లే అవకాశం లేకపోలేదు. మీ ప్రణాళికల్లో ఊహించని మార్పుతో.. ఓ కొత్త అవకాశం వెతుక్కుంటూ వచ్చే సూచనలు ఉన్నాయి. ఏ నిమిషానికి ఏం జరుగునో అన్నట్లు.. మీరు ఊహించని విధంగా మీకు లభించే గొప్ప అవకాశం మిమ్మల్ని ఆనందంతో ముంచెత్తి అవకాశం ఉంది. 

►ALSO READ | తిరుమల కొండపై ఏప్రిల్ 25 నుంచి 27 వరకు పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు.. ఈ రెండు సేవలు రద్దు

ఏప్రిల్ నెల మధ్యలో మారుతున్న గ్రహా స్థితిగతులు.. రాబోయే 15 రోజులు ఈ ఐదు రాశుల వాళ్లకు ఊహించని మార్పులను తీసుకొచ్చే సూచనలు ఉన్నట్లు జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇది గోచారం రీత్యా చెప్పబడుతున్న విషయాలు. వ్యక్తిగత జాతకం అనేది చాలా ముఖ్యం. అందరికీ ఇలాగే జరగాలని లేదు.. వ్యక్తిగత జాతకం ద్వారా మీ సమస్యలకు మరింత పరిష్కారం లభిస్తుంది. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.