టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసు.. కేసును నీరుగార్చేందుకు కుట్ర

టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసు.. కేసును నీరుగార్చేందుకు కుట్ర

హైదరాబాద్ : 2017లో టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంలో ప‌లువురు టాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు కూడా బయటకు వచ్చాయి. అయితే ఆ కేసును నీరుగార్చేందుకు కుట్ర జరుగుతోందని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభ రెడ్డి ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కోసం ఆర్ టి ఐ ద్వారా దరఖాస్తు చేసుకోగా తమకు 8 ఛార్జీ షీట్ల వివరాలు మాత్రమే ఇచ్చారని ఆయన తెలిపారు.

ఈ వ్యవహారంలో 12 కేసులు నమోదు అయ్యాయని… కానీ పోలీసులు 8 కేసుల్లో మాత్రమే ఛార్జ్ షీట్ నమోదు చేయడం పై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. మిగిలిన 4 కేసుల్లో ఎందుకు ఛార్జ్ షీట్ వేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులు నమోదైన సమయంలో మా అసోసియేషన్ ముఖ్యమంత్రిను కలిసారని… ఈ వ్యవహారాన్ని బయటకు రాకుండా ఉండేందుకు వారు ముఖ్యమంత్రిను కోరి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో ఉన్న ప్రతి ఒక్కరిపై ఛార్జ్ షీట్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని… అప్పటి వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Forum for Good Governance Secretary Padmanabha Reddy alleges allegations in Tollywood drugs case