అయిజాలో సత్తా చాటిన ఫార్వర్డ్ బ్లాక్

అయిజాలో సత్తా చాటిన ఫార్వర్డ్ బ్లాక్

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెలువడుతున్నాయి.  అయిజాలో ఫార్వర్డ్ బ్లాక్ సత్తా చూపించింది. మొత్తం 20స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ 10స్థానాలు గెలుచుకుంది. టీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 4 స్థానాల్లో గెలిచాయి. అలంపూర్ ను టీఆర్ఎస్ కైవలం చేసుకుంది. మొత్తం 10స్థానాలకు గాను ఏడు స్థానాల్లో టీఆర్ఎస్, రెండు కాంగ్రెస్, ఒకటి ఫార్వర్డ్ బ్లాక్ గెలచుకున్నాయి. జమ్మికుంట మున్సిపాలిటిని టీఆర్ఎస్ గెలుచుకుంది. మొత్తం 30 స్థానాల్లో 22 టీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు, ఇండిపెండెంట్లు ఐదు స్థానాల్లో గెలిచారు.

మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మున్సిపాల్టిలో టీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. మొత్తం 15 స్థానాలకు గాను 10 టీఆర్ఎస్, బీజేపీ 4, కాంగ్రెస్ ఒక్క స్థానంలో గెలిచాయి. అలాగే ఆత్మకూరులోనూ టీఆర్ఎస్ గెలిచింది. ఇక్కడ మొత్తం 10 వార్డుల్లో టీఆర్ఎస్ 6, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాల్టిలో 24 స్థానాలు గెలుచుకుని టీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. ఇక్కడ మొత్తం 36 ఉండగా బీజేపీ 6, కాంగ్రెస్ 1, ఎంఐఎం 1, ఇండిపెండెంట్లు 4 స్థానాల్లో గెలిచారు.

తొర్రూరును టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 16 స్థానాల్లో 12 టీఆర్ఎస్, కాంగ్రెస్ 3, ఒక్క స్థానంలో బీజేపీ గెలిచాయి. వనపర్తి జిల్లా అమరచింతలో హంగ్ పరిస్థితి ఉంది. ఇక్కడ అన్ని పార్టీలకు ప్రాధాన్యం ఇచ్చారు అక్కడి ఓటర్లు.  మొత్తం 10 స్థానాల్లో సీపీఎం 2, సీపీఐ 1, టీడీపీ 1, టీఆర్ఎస్ 3, బీజేపీ 1, కాంగ్రెస్ 1, ఇండిపెండెంట్స్ 1 స్థానంలో గెలుపొందారు. యాదగిరిగుట్టలోనూ టీఆర్ఎస్ వెనుకబడింది. ఇక్కడ మొత్తం 12 స్థానాలకు గాను కేవలం మూడు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ 5, కాంగ్రెస్ రెబల్స్ 3, సీపీఐ ఒక్క స్థానం గెలుచుకున్నాయి.