ఏనుగుల మృతి కేసులో నలుగురు అధికారులు సస్పెండ్

ఏనుగుల మృతి కేసులో నలుగురు అధికారులు సస్పెండ్

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బల్‌రాంపూర్‌‌, సూరజ్‌పూర్‌‌ జిల్లాల్లో మంగళ నుంచి గురు వారాల్లో మూడు ఏనుగులు చనిపోయిన ఘటనపై ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సీరియస్‌ అయింది. సబ్ డివిజనల్ ఫారెస్ట్‌ ఆఫీసర్‌‌ (ఎస్‌డీఎఫ్‌వో)తో సహా నలుగురు అధికారులను ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్ సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ ఆర్డర్‌‌ ప్రకారం సదరు అఫీషియల్స్‌ తమ డ్యూటీ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలుస్తోంది. ఎస్‌డీఎస్‌వో కేఎస్ కుతియాను సుర్గుజా ఫారెస్ట్‌ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ (రీజనల్)కు అటాచ్ చేశామని, ఇద్దరు ఫారెస్ట్ రేంజర్స్‌తోపాటు ఫారెస్ట్‌ గార్డ్‌ను సస్పెండ్ చేశామని ఓ సీనియర్ అధికారి చెప్పారు. అలాగే బల్‌రాంపూర్ డిస్ట్రిక్ట్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌‌ (డీఎఫ్‌వో)కు షోకాజ్ నోటీస్‌ జారీ చేశామని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్‌ ఫారెస్ట్‌ మినిస్టర్ మహ్మద్ అక్బర్ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. దీనికి మాజీ ఫారెస్ట్‌ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ (పీసీసీఎఫ్) అధ్యక్షతన వహిస్తున్నారు. మృతి చెందిన ఎలిఫెంట్స్‌లో.. మంగళవారం గణేశ్‌పూర్‌‌ ఫారెస్ట్‌లో కార్డియాక్ సమస్యలతో ఓ ఏనుగు చనిపోయిందని, బుధవారం విష ప్రభావంతో ఒకటి, ఇన్ఫెక్షన్ కారణంగా మరో ఏనుగు మృతి చెందాయని ఫారెస్ట్‌ అఫీషియల్స్‌ పేర్కొన్నారు. ఈ ఏనుగులన్నీ ఒకే మందకు చెందినవే గాక సుర్గుజా అడువుల్లో తిరుగాడాయని సమాచారం.