సూర్యుడి కన్నా ఐదు రెట్ల వేడి ప్రొడ్యూస్

సూర్యుడి కన్నా ఐదు రెట్ల వేడి ప్రొడ్యూస్
  • ఫ్యూజన్ ఎనర్జీలో చైనా ‘ఆర్టీఫిషియల్ సన్’ రికార్డ్
  • 17 నిమిషాల్లో ఏడు కోట్ల డిగ్రీల టెంపరేచర్ ఉత్పత్తి

బీజింగ్‌‌: చైనా తయారుచేసిన ‘ఆర్టిఫిషియల్ సన్’ ఫ్యూజన్ ఎనర్జీ రియాక్టర్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇది సూర్యుడి కన్నా ఐదు రెట్ల వేడిని ప్రొడ్యూస్ చేసినట్లు చైనీస్ సైంటిస్టులు ప్రకటించారు. 1056 సెకండ్ల పాటు అంటే 17 నిమిషాలకు పైగా ఏడు కోట్ల డిగ్రీల సెల్సియస్‌‌ ఉష్ణోగ్రతను ఇది సృష్టించిందని వారు చెప్పారు. సాధారణంగా సూర్యుడి వేడి 1.5 కోట్ల డిగ్రీల సెల్సియస్‌‌ ఉంటుంది. దీనితో పోల్చితే ఆర్టిఫిషియల్ సన్ టెంపరేచర్ దాదాపు ఐదు రెట్లు అధికమని చైనా సైంటిస్టులు ప్రకటించారు. హై టెంపరేచర్​ ప్లాస్మా ఆపరేషన్‌‌లో ప్రపంచంలోనే ఇది చాలా హయ్యెస్ట్ అని వారు చెప్పారు. డ్యుటీరియం వినియోగంతో సూర్యుడిలో జరిగే న్యూక్లియర్‌‌ ప్యూజన్‌‌ ప్రాసెస్​ను అనుసరించి స్వచ్ఛమైన పవర్​ను ఉత్పన్నం చేయడమే ఈ రియాక్టర్ ఉద్దేశం. ఈ ఎనర్జీ డివైస్​చైనా హీఫీ ప్రావిన్స్ లోని చైనీస్‌‌ అకాడమీ ఆఫ్‌‌ సైన్సెస్‌‌లో ఉంది. ఇంటర్నేషనల్‌‌ థర్మో న్యూక్లియర్‌‌ ఎక్స్‌‌పెరిమెంటల్‌‌ రియాక్టర్‌‌ (ఐటీఈఆర్‌‌) ప్రాజెక్టులో భాగమైన ఈ రియాక్టర్ 2006లో తొలిసారి ప్రయోగాలకు అందుబాటులోకి వచ్చింది. ఐటీఈఆర్‌‌ ప్రాజెక్టులో ఇండియా, సౌత్ కొరియా, జపాన్‌‌, రష్యా, అమెరికా వంటి దేశాలూ భాగస్వాములుగా ఉన్నాయి. ఇది 2021 మొదట్లో 101 సెకన్ల పాటు 20 మిలియన్ల డిగ్రీల సెల్సియస్‌‌ రికార్డు అందుకోగా.. ఈసారి 1056 సెకన్లపాటు 70 మిలియన్‌‌ డిగ్రీల సెల్సియస్‌‌ టెంపరేచర్ సృష్టించింది.