ప్రధాని మోదీ ఆస్తి ఎంతో తెలుసా?

ప్రధాని మోదీ ఆస్తి ఎంతో తెలుసా?

ప్రధాని మోదీ తన ఆస్తులను ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మే14వ తేదీ మంగళవారం ఉత్తరప్రదశ్ లోని వారణాసిలో మోదీ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వరుసగా మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. వారణాసి కలెక్టర్ కార్యాలయంలో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన మొత్తం ఆస్తుల విలువ రూ.3.02 కోట్లుగా ప్రధాని మోదీ వెల్లడించారు.

ఎన్నికల అఫిడవిట్ ప్రకారం..   రూ. 52,920 నగదు, రూ. 2,85,60,338 విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నట్లు తెలిపారు.  రూ. 2.67 లక్షల విలువైన బంగారం, నాలుగు బంగారు ఉంగరాలతోపాటు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లలో రూ.9.12 లక్షల పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు.

కాగా, గతంలో కంటే ప్రస్తుతం మోదీ ఆస్తులు పెరిగాయి. 2014లో మోదీ మొత్తం ఆస్తుల విలువ రూ.1.66 కోట్లుగా ఉండగా..  2019లో ఆయన ఆస్తుల విలువ రూ.2.51 కోట్లు ఉంది. అయితే, ప్రధాని మోదీ.. తన భార్య, తల్లి ఆస్తులను వెల్లడించలేదు.