శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి బ్లూబర్డ్ బ్లాక్-2 మిషన్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. బుధవారం (డిసెంబర్ 24) ఉదయం 8.45 గంటలకు రాకెట్ బ్లూబర్డ్ బ్లాక్ 2ను మోసుకెళ్లే ఇస్రోకు చెందిన LVM3M6 అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి LVM3M6 ను ప్రయోగించనున్నారు. 6వేల 100 కిలోల బరువున్న ఈ శాటిలైట్ ను లో LVM3M6 రాకెట్ లో ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టనుంది.
బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రత్యేకతలు
సెల్యులర్ బ్రాడ్ బాండ్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఉపయోగపడేదే ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ నెక్స్ట్ జెనరేషన్ శాటిలైట్‌ను అమెరికాకు చెందిన ఏఎస్ టీ స్పేస్ మొబైల్ కంపెనీ అంతరిక్షంలోకి పంపిస్తోంది. ఈ ఉపగ్రహం నేరుగా మొబైల్ కు అనుసంధానం చేసుకోవచ్చు. ఇందుకోసం మొబైల్ ఫోన్లలో ఎలాంటి స్పెషల్ సాఫ్ట్ వేర్ అవసరంలేదు.
►ALSO READ | ద్రవ్యోల్బణం లెక్కింపులో కొత్త విధానం: ఇక ఆన్‌లైన్ ధరలతోనే రిటైల్ రేట్ల లెక్కింపు
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా సరే ఉపగ్రహానికి నేరుగా కనెక్ట్ కావడం ద్వారా హైస్పీడ్ సెల్యులర్ బ్రాడ్ బాండ్ సేవలను పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 50 సెల్ కంపెనీలతో ఏఎస్ టీ కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. కాగా, ఈ మిషన్‌లో భాగంగా 2024 సెప్టెంబర్‌లో బ్లూబర్డ్ (1 నుంచి 5) శాటిలైట్లను ఏఎస్ టీ కంపెనీ నింగిలోకి పంపించింది.
