T20 World Cup: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న సౌతాఫ్రికా.. 

T20 World Cup: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న సౌతాఫ్రికా.. 

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ గ్రూప్-డీ నుంచి పోటీ పడుతున్న దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. టాస్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. పిచ్ చాలా బాగుంది.. మేం ముందు బ్యాటింగ్ చేసి మంచి స్కోరు చేయడానికి ప్రయత్నిస్తాం.. ఇది చాలా పెద్ద మ్యాచ్.. చివరి వరకు పోరాడాలి.. దక్షిణాఫ్రికా ఎంత బలమైన జట్టో మాకు తెలుసు అన్నారు. గత మ్యాచ్‌లతో పోలిస్తే స్వల్ప మార్పులు చేశాం.. చెప్పారు. ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశారు.  

దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రం మాట్లాడుతూ.. నైట్ మ్యాచ్‌లలో వికెట్ మెరుగ్గా మారుతుంది అన్నారు. ఇక్కడ ఒక నైట్ మ్యాచ్ ఆడాం.. మ్యాచ్ సాగేకొద్దీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంది.. అందుకే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాం.. డ్యూ కొంచెం ఉంటే మాకు ఇబ్బంది లేదన్నారు. ఈ మ్యాచ్‌ గెలిచేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.. టీంలో ఒక మార్పు చేశాం.. జార్జ్ లిండే స్థానంలో కార్బిన్ బోష్‌ను తుది జట్టులోకి తీసుకున్నామని మార్క్రం తెలిపారు.
 
న్యూజిలాండ్: 
ఫిన్ అలెన్, టిమ్ సైఫర్ట్ (వికెట్‌కీపర్), రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), జేమ్స్ నీషమ్, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జేకబ్ డఫీ

దక్షిణాఫ్రికా:
ఐడెన్ మార్క్రం (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్), రయాన్ రికెల్టన్, దేవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బోష్, కగిసో రబడా, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడీ