T20 World Cup: టీ20 ప్రపంచకప్ గ్రూప్-సీ మ్యాచ్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఇంగ్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్ మ్యాచ్ జరుగుతుంది. స్కాట్లాండ్ తో మ్యాచులో ఇంగ్లాండ్ తడబడింది. 153 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆ జట్టు ప్రారంభంలో బాగా ఇబ్బంది పడింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లీష్ జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ తీసుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్ అయింది. ఫస్ట్ బ్యాటింగ్ కి వచ్చిన స్కాట్లాండ్ ఓపెనర్ జార్జ్ మున్సే (4), బ్రాండన్ మెక్‌ముల్లెన్ విఫలం అయ్యారు. కెప్టెన్ రిచీ బెరింగ్టన్ (49), మైఖేల్ జోన్స్ (33), టామ్ బ్రూస్ (24), ఆలివర్ డేవిడ్సన్ (20) లను ఇంగ్లాండ్ బౌలర్లు కట్టడి చేయడంతో 152 రన్స్ కే స్కాంట్లాండ్ కూప్పకూలిపోయింది.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టుకు మొదట్లోనే బిగ్ షాక్ తగిలింది. ఫిలిప్ సాల్ట్ (2), జోస్ బట్లర్ (3), కెప్టెన్ హ్యారీ బ్రుక్ (4) పరుగులే చేసి అవుట్ అయ్యారు. అ తర్వాత క్రీజులోకి వచ్చిన జాకబ్ బెథెల్ (32), సామ్ కర్రన్ (28) ఫర్వాలేదనిపించగా, టామ్ బాంటన్ మాత్రం (63) హాఫ్ సెంచరీ, చివర్లో విల్ జాక్స్ ఒక ఫోర్, ఒక సిక్స్ తో మ్యాచ్ ను ముగించేశారు. దీంతో 18.2 ఓవర్లలోనే ఇంగ్లాండ్ జట్టు టార్గెట్ ను ఛేదించి.. గ్రూప్–సీలో 4 పాయింట్లలో రెండో స్థానంలో నిలిచింది.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ఇంగ్లాండ్ బ్యాటర్ టామ్ బాంటన్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. టీ20 క్రికెట్ పూర్తిగా రిస్క్‌తో కూడిన ఆట.. కొన్ని సార్లు మనకు అనుకూలంగా ఉండదు.. అప్పుడు కూడా మన మీద మనం నమ్మకం ఉంచాలి.. అది కష్టం అయినా సరే, మళ్లీ ప్రయత్నం చేయాలి, కష్టపడాలి, ప్రాక్టీస్ చేయాలని సూచించారు. అదృష్టవశాత్తు ఈ రోజు నాకు కలిసొచ్చింది అంటూ తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశారు.
