న్యూ ఇయర్ కి సమయం దగ్గరపడుతోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరు కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ప్రిపేర్ అవుతున్నారు. ఇక హైదరాబాద్ లో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిసెంబర్ 31 రాత్రి సెలెబ్రేషన్స్ కోసం హైదరాబాద్ యువత ఎంతగానో ఎదురు చూస్తుంటారు. కార్పొరేట్ ఈవెంట్స్, పబ్స్ లో స్పెషల్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి కమ్యూనిటీల్లో సెలెబ్రేషన్స్, రోడ్ల మీద యూత్ హడావిడి వెరసి హైదరాబాద్ లో పండగ వాతావరణం పీక్స్ లో ఉంటుంది. ఈ క్రమంలో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్. న్యూ ఇయర్ వేడుకల పేరుతో హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సజ్జనార్.
హైదరాబాద్ లో రేపటి ( డిసెంబర్ 24 ) నుంచే న్యూ ఇయర్ వరకు నగరవ్యాప్తంగా స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.డిసెంబరు 31 రాత్రి 100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్స్ నిర్వహిస్తామని.. తనిఖీల కోసం 7 ప్లాటూన్ల అదనపు బలగాల మోహరించనున్నట్లు తెలిపారు సజ్జనార్.డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే వాహనం సీజ్, రూ.10 వేల జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధిస్తామని.. అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వత రద్దు కూడా చేస్తామని హెచ్చరించారు సజ్జనార్.
►ALSO READ | లోపాలున్న జీవో 252ను సవరించాలె..అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలె
పబ్‌లు, త్రీస్టార్ పైస్థాయి హోటళ్లలో వేడుకలకు రాత్రి 1 గంట వరకే అనుమతి ఉంటుందని.. శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తే సౌండ్ సిస్టమ్‌లు సీజ్ చేస్తామని అన్నారు.న్యూ ఇయర్ వేడుకల్లో గంజాయి, మాదకద్రవ్యాలు, అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని.. రూల్స్ అతిక్రమిస్తే.. యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి లైసెన్స్ రద్దు చేస్తామని అన్నారు సజ్జనార్.మహిళల భద్రతకు 15 షీ టీమ్స్ మఫ్టీలో నిఘా ఏర్పాటు చేయనున్నామని.. అసభ్య ప్రవర్తనకు తక్షణ అరెస్టు ఉంటుందని అన్నారు సజ్జనార్. సో, హైదరాబాదీస్... న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ మనసారా ఎంజాయ్ చేయండి బట్, బీ అలర్ట్.. రూల్స్ అతిక్రమిస్తే న్యూ ఇయర్ జైల్లో గడపాల్సి వస్తుంది జాగ్రత్త.
