రీల్స్ పిచ్చి రోజురోజుకు పీక్స్ స్టేజ్ కు పోతుంది. ఎలాగైనా ఫేమస్ కావాలనే పిచ్చితో ఇష్టానుసారంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టుచేస్తున్నారు కొందరు. హైదరాబాద్ శంషాబాద్ లో ఓ ఇద్దరు యువకులు దేవుడికి ప్రసాదంగా గంజాయి పెట్టారు. ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి
హైదరాబాద్ శంషాబాద్ లోని ధర్మగిరి టెంపుల్ లో దేవుడికి ప్రసాదంగా గంజాయి పెట్టారు యువకులు.మహా శివరాత్రి సందర్భంగా చరణ్ తో పాటు అతని స్నేహితులు శివుడికి గంజాయిని ప్రసాదంగా పెట్టారు .అంతటి తోఆగకుండా గంజాయిని ప్రసాదంగా పెట్టే వీడియోను తీసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దేవుడికి అందరూ కొబ్బరికాయ కొడతారు అలా కాకుండా మేము ప్రత్యేకంగా గంజాయి పెడుతున్నామంటూ వీడియో తీశారు.
ఇన్ స్టాగ్రామ్ లో రీల్ వైరల్ కావడంతో నెటిజెన్లు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు యువకులు బడంగ్ పేటకు చెందిన వారిగా గుర్తించారు. ప్రస్తుతం యువకుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇలాంటి రీల్స్ పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ సజ్జనార్ హెచ్చరించారు.
