గోదావరి ఖని, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ, కాంగ్రెస్ కౌన్సిలర్ల కాన్వాయ్‌పై బీఆర్‌ఎస్ శ్రేణుల దాడిని ఖండిస్తున్నట్లు గోదావరిఖని కాంగ్రెస్ లీడర్ మల్లికార్జున్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మంత్రి, ఎంపీ వంశీకృష్ణ వాహనాల్లో కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ ఆఫీస్‌కు వస్తుండగా.. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి, వీధి రౌడీలా ఆ పార్టీ లీడర్లతో కలిసి మంత్రి కాన్వాయ్ పై రాళ్లతో దాడి చేయడం దారుణమన్నారు.
ఈ దాడిలో కాంగ్రెస్ లీడర్లతోపాటు పోలీసులకూ గాయాలయ్యాయన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించిన బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పై హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మల్లికార్జున్ డిమాండ్ చేశారు.
