కరీంనగర్ టౌన్,వెలుగు: 23 వారాల్లో జన్మించిన శిశువులను సైతం కాపాడే అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని హైటెక్ సిటీ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ పీడీయాట్రిక్ నియోనాటలిస్టు డాక్టర్ రవీందర్‌రెడ్డి, పీడియాట్రిక్ సర్జన్ మధుమోహన్, గైనకాలజిస్టు భార్గవి వెల్లడించారు. మంగళవారం కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్‌లో హైరిస్క్ గర్భధారణల్లో నెలలు నిండకుండా జన్మించిన శిశువులకు ఆధునిక పరికరాలతో చేపడుతున్న నియోనాటల్ చికిత్స విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ హైరిస్క్ గర్భదారణ తల్లుల్లో ప్రతి నిమిషం విలువైనదేనన్నారు.
కరీంనగర్ వంటి ప్రాంతాల్లో హైరిస్క్ గర్భధారణలు, నెలలు నిండకుండా జరిగే ప్రసవాల సందర్భాల్లో సమయానుకూలంగా ప్రత్యేక వైద్యం అందకపోవడం తల్లీశిశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని తెలిపారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌లో అత్యాధునిక ఎన్‌ఐసీయూ సదుపాయాలు, 24 గంటల నియోనేటాలజీ సేవలు, పీడియాట్రిక్ సర్జరీ, ప్రత్యేకంగా శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, మార్కెటింగ్ హెడ్ కర్నాకర్, హెచ్ఆర్ మేనేజర్ ఈశ్వర్ పాల్గొన్నారు.
