కేరళ కొత్త బ్రాందీ తయారీ.. పేరు పెట్టండి 10 వేలు పట్టుకెళ్లండీ..!

కేరళ కొత్త బ్రాందీ తయారీ.. పేరు పెట్టండి 10 వేలు పట్టుకెళ్లండీ..!

కేరళ రాష్ట్రం కొత్త బ్రాందీని తయారు చేస్తోంది.. అదేనండీ మందు. కేరళ రాష్ట్రంలో ఫస్ట్ తయారు చేస్తున్న బ్రాందీ బ్రాండ్ ఇది. 2026.. ఫిబ్రవరి 21వ తేదీన అధికారికంగా మార్కెట్ లోకి బ్రాందీని విడుదల చేయనుంది కేరళ ప్రభుత్వం. పాలక్కాడ్ లోని మలబార్ డిస్ట్రిలరీలో ఈ బ్రాందీ తయారు అవుతుంది. ఇదంతా ఓకే.. కొత్త బ్రాందీ తయారు చేయటం.. మందు బాబులకు కొత్త మందు రుచిని పరిచయం చేయటం వరకు ఓకే.. వీళ్లు చేస్తున్న పబ్లిసిటీనే ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. 

కేరళ రాష్ట్రం నుంచి కొత్త తయారయ్యి వస్తున్న బ్రాందీకి.. మీరే పేరు పెట్టండి అంటూ ఆహ్వానించటం విశేషం. కేరళ కొత్త బ్రాందీకి పేరు, లోగో సూచించిన వాళ్లకు 10 వేల రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు డిస్ట్రిలరీ కంపెనీ వాళ్లు. దీనిపై సంప్రదాయవాదులు. మందు తాగని వారు విమర్శలు చేస్తున్నారు. బ్రాందీ మందును ప్రమోషన్ చేయటం కోసం ఇలాంటి చీప్ ప్రమోషన్ చేస్తున్నారని.. జనానికి బ్రాందీని పరిచయం చేయటం కోసం ఇలాంటి ఎత్తుగడ వేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ అంశంపై కోర్టుకు వెళ్లారు కొందరు వ్యక్తులు. బ్రాందీ పేరు, లోగో బహుమతిని ఛాలెంజ్ చేశారు. దీనిపై కేరళ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ తన వివరణ ఇచ్చింది. ఆ కంపెనీ ప్రమోషన్ కు సంబంధించి.. ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని.. మా పాత్ర లేదని వివరించింది. దీంతో కోర్టు.. బ్రాందీ తయారు చేస్తున్న డిస్ట్రిలరీ కంపెనీ అయిన మలబాస్ డిస్ట్రిలరీకి నోటీసులు ఇచ్చింది.