లాంగ్ లీవ్ లో గద్వాల ఆర్డీవో

లాంగ్ లీవ్ లో గద్వాల ఆర్డీవో
  •     ఫైళ్ల క్లియరెన్స్​లో నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు

గద్వాల, వెలుగు: గద్వాల ఆర్డీవో అలివేలు లాంగ్ లీవ్ లో వెళ్లడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆర్డీవో గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఫైళ్ల క్లియరెన్స్ లో ఆమె నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలున్నాయి. టీఎం 33 మిస్సింగ్ సర్వే నంబర్లు, డీఎస్ పెండింగ్, సక్సెషన్స్, ఓఆర్ సీల అప్లికేషన్లు దాదాపు 1,000కి పైగా పెండింగ్ ఉన్నాయి.

15 రోజుల క్రితం కలెక్టర్ సంతోష్ ఆర్డీవో ఆఫీస్ ను సడన్ గా విజిట్ చేశారు. పెండింగ్​ఫైళ్ల వివరాలు తెలుసుకున్నారు. అన్నింటినీ గడువులోగా క్లియర్ చేయాలని ఆదేశించారు. అయినా ఆర్డీవో ఆఫీసులో అధికారులు, సిబ్బంది పనితీరులో మార్పు రాకపోగా.. వారం రోజుల కింద ఆర్డీవో లాంగ్ లీవ్ పై వెళ్లిపోయారు. ఆమె ట్రాన్స్ ఫర్ చేయించుకొని, మరోచోటుకు వెళ్తున్నట్లు సమాచారం.