ఆల్ టైమ్ హైకి వెండి ధరలు ..ఎంత పెరిగిందంటే.?

ఆల్ టైమ్ హైకి వెండి ధరలు ..ఎంత పెరిగిందంటే.?

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం, వెండి ధరలు సోమవారం సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, వెండి ధర కూడా కేజీకి రూ.10,400 ఎగబాకి రూ.2,14,500 వద్ద ఆల్ టైమ్ హైకి చేరింది.  ఈ ఏడాది ప్రారంభంలో కేజీ వెండి సుమారు రూ.80 వేల నుంచి రూ.90 వేల మధ్య ఉండగా, ప్రస్తుతం అది రూ.2.14 లక్షల మార్కును దాటింది.

 ఇప్పటివరకు కేజీ ధర రూ.1.20 లక్షల నుంచి రూ.1.30 లక్షల వరకు పెరిగింది. పది గ్రాముల బంగారం ధర సోమవారం రూ.1,685 పెరిగి రూ.1.38 లక్షల మార్కును దాటింది.  అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 4,420 డాలర్లు, వెండి ధర 69.45 డాలర్లకు పెరగడం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పారిశ్రామిక డిమాండ్ పెరగడం వల్ల ధరలు దూసుకెళ్తున్నాయి.