యాదగిరిగుట్టలో ఫ్లెక్సీ వార్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. ఇరుపార్టీల కార్యకర్తల బాహాబాహీ

యాదగిరిగుట్టలో ఫ్లెక్సీ వార్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. ఇరుపార్టీల కార్యకర్తల బాహాబాహీ
  • మంత్రుల పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు కట్టిన హస్తం శ్రేణులు
  • గులాబీ పార్టీ అభ్యంతరం

యాదాద్రి: యాదగిరిగుట్టలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఫ్లెక్సీ వార్ నడిచింది. ఆలేరు నియోజకవర్గ నూతన సర్పంచ్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమం పట్టణంలో ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రులు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు యాదగిరి గుట్ట వైకుంఠ ద్వారం వద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే, ఆలయ ఆవరణ, నిషేధిత ప్రాంతంలో ఫ్లెక్సీలు కట్టారంటూ బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తంచే శారు. 

అనంతరం వాటిని చింపివేసి వైకుంఠ ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటనతో ఇరుపార్టీల నేతలు, కార్యకర్తల బాహాబాహీకి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. 

►ALSO READ | ఉచిత బస్సు మహిళలు అడిగారా..? ఫ్రీబీస్ తో ప్రజలను సోమరిపోతులను చేస్తుండ్రు: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

కాగా, గతంలోనూ మంత్రుల పర్యటన సందర్భంగా ఇష్టారీ తిన కాంగ్రెస్ కార్యకర్తల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.భారత రాష్ట్ర సమితి స్థానిక ఎమ్మెల్యేకు ఈవో మద్దతుగా ఉంటూ ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు.