యాదాద్రి : జనవరి 4న ఎనమిది జిల్లాల్లోని ట్రిపుల్ ఆర్ రైతులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ట్రిపుల్ ఆర్ రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని అన్నారు. బీబీ నగర్ లోని ఎయిమ్స్ ను ఆమె సందర్శించారు. అనతంరం కవిత మాట్లా డుతూ.. రైతులను జైలు పంపించడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఆ ప్రభుత్వం నేను ఉన్నాను. నాకు తెలియదు కావున నేను రాయాగిరి రైతులను క్షమాపణలు కోరుతు న్నాను.
రాయగిరి రైతులు ఇప్పటికే చాలాసార్లు భూములు ఇచ్చి ఉన్నారు. కావున అలైన్మెం ట్ మార్చాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా.. గడ్కరీ కలుద్దాం అని అన్నారు. పెద్దల భూములు కాపాడేందుకు చిన్న సన్నకారు రైతులకు
అన్యాయం జరగకుండా చూడాలని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరారు.
►ALSO READ | తిరుమల మెట్ల మార్గంలో అపరిశుభ్రత : భక్తుల భద్రతపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆవేదన
మరోవైపు ఎయిమ్స్ లో ఎమర్జెన్సీ మెడిసిన్ దొరకే పరిస్థితి లేదన్నారు. అన్నారు. భవన నిర్మాణంలో కాంట్రాక్టర్ల అలసత్వం వహిస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు దృష్టి సారించి ఎయిమ్స్ కాంట్రాక్టర్లు ఒత్తిడి తెచ్చిన నిర్మాణా లు పూర్తి చేయాలన్నారు.
