తిరుమల మెట్ల మార్గంలో అపరిశుభ్రత : భక్తుల భద్రతపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆవేదన

తిరుమల మెట్ల మార్గంలో అపరిశుభ్రత : భక్తుల భద్రతపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆవేదన

తిరుపతి: తిరుమల మెట్ల మార్గంలో నెలకొన్న దయనీయ పరిస్థితులపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాకా వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి శ్రీఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ భక్తితో మెట్ల మార్గం ద్వారా కొం డలెక్కుతున్న సమయంలో అక్కడ ఏర్పడిన పరిస్థితులు తన మనసును తీవ్రంగా కలచివేశా యని తెలిపారు. 

ప్రస్తుతం ఏడుకొండల మెట్ల మార్గం అత్యంత నిర్లక్ష్యానికి గురైందని పేర్కొ న్నారు. మెట్ల దారి పొడవునా ప్లాస్టిక్ వ్యర్థాలు, కన్స్ట్రక్షన్ వేస్ట్ పేరుకుపోయి ఉండటం వల్ల భక్తు లకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని అన్నారు. టాయిలెట్ ఇన్నోవేషన్ల పేరుతో ఏర్పాటు చేసిన కమోడ్లు, మెట్ల మధ్యలో పెట్టిన స్టీల్ ట్రేల కారణంగా భక్తులు సరిగా నడవలేని ప్రమా దకర పరిస్థితి నెలకొందని, కాళ్లకు గాయాల య్యే అవకాశం అధికంగా ఉందని తెలిపారు. 

అంతేకాకుండా, కనీసం ఫస్ట్ఇయిడ్ కేంద్రాలు కూడా మెట్ల మార్గంలో అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి మెట్టు వద్ద భక్తులు బస్సులు, కార్ల మధ్య నుంచి ప్రాణాలకు తెగించి రోడ్డు దాటాల్సి వస్తోందని, ఇది భక్తులభద్రతపై తీవ్రమైన నిర్లక్ష్యానికి నిదర్శనమని పే ర్కొన్నారు. 

ఈ పరిస్థితులపై ఏపీ మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించాలని ఎంపీ గడ్డం వం శీకృష్ణ కోరారు. అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించి, తిరుమల మెట్ల మార్గంలో తక్షణమే మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. భక్తుల భద్రత, శుభ్రత, గౌరవంతో దర్శనం జరగడం అత్యంత ప్రాధాన్యమని, తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో ఇటువంటి పరిస్థితులు కొనసాగడం అనర్హమని ఆయన స్పష్టం చేశారు.