
నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం(Saripodhaa Sanivaaram). దర్శకుడు వివేక్ ఆత్రేయ(Vivek Athreya) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మొహనన్(Priyanka Mohanan) హీరోయిన్ గా నటిస్తున్నారు.డీవీవీ దానయ్య(DVV Danayya) నిర్మిస్తున్న ఈ సినిమా తమిళ నటుడు SJ సూర్య కీ రోల్ చేస్తున్నారు.
అంటే సుందరానికి వంటి సినిమా తరువాత నాని,వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో సరిపోదా శనివారంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
తాజాగా సరిపోదా శనివారం మేకర్స్ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది."ప్రతిధ్వనించే సమయం ఇది..సరిపోదా శనివారం క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్‌లో అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్‌లో షూటింగ్ జరుగుతోంది.ఆగస్ట్ 29న థియేటర్స్లో పండగకి రెడీగా ఉండండి" అంటూ ట్వీట్ చేశారు.ఈ అప్డేట్తో నాని ఫ్యాన్స్ దసరా లాంటి భారీ క్లైమాక్స్ కావాలంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
It's time for the reverberating ?????????? ???? ?? ?????? once again! ?
— DVV Entertainment (@DVVMovies) May 14, 2024
The climax shoot of #SaripodhaaSanivaaram is taking place on a huge set in Hyderabad ❤️?
August 29th theatres lo pandagakki ready ga undandi ??#SuryasSaturday
Natural ?… pic.twitter.com/7kwjhtcfkY
రీసెంట్గా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ తోనే సినిమా ఎంత ఇంటెన్సిఫైడ్ గా ఉండనుందో తెలిసిపోయింది. అందులో 'కోపం అనేది ఒక్కో మనిషిలో ఒక్కో రకంగా ఉంటుంది. కానీ, ఆ కోపాన్ని కూడా క్రమబద్ధంగా, పద్దతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చినా కొడుకుని ఎవరైనా చూశారా? నేను చూశా. వాడి పేరు సూర్య..రోజు శనివారం..అంటూ SJ సూర్య చెప్పిన డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.అంతేకాదు నాని లుక్స్ కూడా సరికొత్తగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
ఈ సారి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సాలిడ్ స్క్రిప్ట్ తో..నానికి హిట్ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యినట్టుగా టైటిల్ గ్లింప్స్ ఉంది.ఈ మూవీకి జేక్స్ బేజోయ్ సంగీతం అందిస్తున్నారు.