ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు

ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు

ప్రజా యుద్ధనౌక, విప్లవ వీరుడు గద్దర్ అంత్యక్రియలు రేపు (ఆగస్టు7) ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి.  అధికార లాంఛనాలతో నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు.  రేపు మధ్నాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి సికింద్రాబాద్ మీదుగా అల్వాల్ లోని  గద్దర్ ఇంటి వరకు అంతిమ యాత్ర జరగనుంది. అల్వాల్ లోని మహభోది స్కూల్ గ్రౌండ్ లో గద్దర్ అంత్యక్రియలు జరగనున్నాయి.  

గద్దర్  భౌతికకాయాన్ని ఎల్బీస్టేడియానికి తరలించారు. ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచారు. గద్దర్ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు పలు  రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అన్ని పార్టీల రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు, సినీ రంగానికి చెందిన పలువురు తరలివచ్చి.. నివాళులర్పిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఎల్బీ స్టేడియంలోనే గద్దర్ పార్థివదేహం ఉంచనున్నారు. 12 గంటల తర్వాత ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్‌ అంతిమయాత్ర కొనసాగనుంది