V6 News

జల వనరులను పరిరక్షించాలి: కమిషనర్

జల వనరులను పరిరక్షించాలి: కమిషనర్

హైదరాబాద్, వెలుగు : సిటీలోని జల వనరులను పరిరక్షించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన శేరిలింగంపల్లి జోన్ నల్లగండ్ల లేక్​ను అధికారులతో కలిసి పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ.. నల్లగండ్ల చెరువును వద్ద సీఎస్ఆర్ ద్వారా చేపట్టిన ఫెన్సింగ్, సివరేజ్ డైవర్షన్, వాకింగ్, సైకిల్ ట్రాకింగ్, ఎలక్ట్రిసిటీ, సీసీ కెమెరాల ఏర్పాటు, ల్యాండ్ స్కేపింగ్ పనులను వీలైనంత పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రేటర్ పరిధిలోని చెరువులు కబ్జాకు గురవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ స్నేహ శబరీష్, లేక్స్ అడిషనల్ కమిషనర్ శివ కుమార్ నాయుడు, లేక్ ఈఈ నాగరాజు, అపర్ణ ఇన్ ఫ్రా ప్రతినిధులు ఉన్నారు.