1,365 పోస్టులతో గ్రూప్ - 3 నోటిఫికేషన్ రిలీజ్

1,365 పోస్టులతో గ్రూప్ - 3 నోటిఫికేషన్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 1,365 పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ శుక్రవారం గ్రూప్–3 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 26 డిపార్ట్​మెంట్లలోని 107 రకాల పోస్టులను ఈ నోటిఫికేషన్​ ద్వారా భర్తీ చేయనున్నారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు ఆన్​లైన్​లో అప్లికేషన్లు తీసుకుంటారు. వేకెన్సీల బ్రేకప్, ఏజ్, స్కేల్, కమ్యూనిటీ, క్వాలిఫికేషన్ తదితర వివరాలతో జనవరి 24న పూర్తి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు టీఎస్​పీఎస్సీ వెల్లడించింది. అయితే ఈ పోస్టుల్లో సగానికి పైగా.. 712 పోస్టులు  ఫైనాన్స్ డిపార్ట్​మెంట్​కు సంబంధించినవే ఉన్నాయి.  

హయ్యర్ ఎడ్యుకేషన్​లో 89, రెవెన్యూలో 73 ఉన్నాయి. ఇప్పటికే గ్రూప్1 ప్రిలిమ్స్ పూర్తికాగా, రెండు రోజుల క్రితం  గ్రూప్–2, నెల క్రితం గ్రూప్–4  నోటిఫికేషన్​ను టీఎస్​పీఎస్సీ  విడుదల చేసింది. దీంతో గ్రూప్స్  నోటిఫికేషన్ల ప్రక్రియ ముగిసినట్టైంది.

డిపార్ట్​మెంట్ల వారీగా గ్రూప్-3  పోస్టుల వివరాలు

డిపార్ట్​మెంట్    పోస్టులు
అగ్రికల్చర్​ అండ్​ కో ఆపరేషన్​    27 
యానిమల్​ హస్బెండ్రీ, 
డైరీ డెవలప్​మెంట్​ అండ్​ ఫిషరీస్​    02 
బీసీ సంక్షేమ శాఖ    27 
విద్యుత్ శాఖ    02  
ఎన్విరాన్​మెంట్, ఫారెస్ట్స్, 
సైన్స్​ అండ్​ టెక్నాలజీ    07 
ఫైనాన్స్  డిపార్ట్​మెంట్    712 
ఫుడ్​ అండ్​ సివిల్​ సప్లైస్​    16
జనరల్​ అడ్మినిస్ట్రేషన్​ డిపార్ట్​మెంట్    46
హెల్త్​, మెడికల్​ అండ్​ ఫ్యామిలీ వెల్ఫేర్​    39
హయ్యర్​ ఎడ్యుకేషన్​    89
హోం శాఖ    70
ఇండస్ట్రీస్​ అండ్​ కామర్స్​    25
ఇరిగేషన్​ అండ్​ కమాండ్​ ఏరియా 
డెవలప్​మెంట్    01
లేబర్​ అండ్​ ఎంప్లాయ్​మెంట్​    33
మైనార్టీస్​ వెల్ఫేర్​    06
మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్​ అండ్​ 
అర్బన్​ డెవలప్​మెంట్​    18
పంచాయత్​ రాజ్​ అండ్​ 
రూరల్​ డెవలప్​మెంట్​    29
ప్లానింగ్​ డిపార్ట్​మెంట్​    03
రెవెన్యూ డిపార్ట్​మెంట్​    73
షెడ్యూల్డ్​ కాస్ట్స్​ డెవలప్​మెంట్​    36
సెకండరీ ఎడ్యుకేషన్​    56
ట్రాన్స్​పోర్ట్, రోడ్స్​ అండ్​ బిల్డింగ్స్​    12
ట్రైబల్​ వెల్ఫేర్​    27
స్ర్తీ, శిశు సంక్షేమశాఖ    03
యూత్​ అడ్వాన్స్​మెంట్, 
టూరిజం అండ్​ కల్చర్​    05
ట్రైబల్​ వెల్ఫేర్​ (ట్రైకార్-ట్రైబల్​కో 
ఆపరేటివ్​ ఫైనాన్స్ 
​కార్పొరేషన్ లిమిటెడ్​)    01
మొత్తం    1,365