ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్యాంటీన్ ఫుడ్ మెనూలో మార్పులు

ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్యాంటీన్ ఫుడ్ మెనూలో మార్పులు

ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్యాంటీన్లలో అందించే ఆహారంలో మార్పులు చేస్తామన్నారు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా. ఇక నుంచి ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్యాంటీన్లలో వేయించిన ఆహారాన్ని అందించబోమని ఆయన బుధవారం ప్రకటించారు. ముడి అరటి సగ్గుబియ్యం, మిల్లెట్ రోటీ, రాగి షీరా, ఆయుర్వేద కిచ్‌డీ మొదలైన వాటితో కాల్చిన సమోసాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తామన్నారు. 

"మన గ్రంథాలు మరియు శాస్త్రవేత్తలు మన ఆహారమే మనకు ఔషధం అని నమ్ముతారు మరియు జీవితంలో మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం చాలా ముఖ్యం" అని మాండవీయ ఈ సందర్భంగా పేర్కొన్నారు.  సులువుగా తయారు చేయగలిగిన మరియు ఆరోగ్యకరమైన వంటకాలను అందించాలనేది తమ ఆలోచన అన్నారు. వేయించిన ఆహారాన్ని క్యాంటీన్ల నుంచి తొలగించే ప్రయత్నాలు చేశామన్నారు. ఎందుకంటే ఫ్రై చేసిన ఆహారం ఆరోగ్యకరమైనది కాదని ఆయన పేర్కొన్నారు. ఉదాహరణకు సమోసాలో బంగాళదుంపలకు బదులు... అరటిపండ్లు వాడాలని నిర్ణయించామన్నారు. ఈ మార్పు కాస్త రుచిలో కాస్త ట్విస్ట్ ఇచ్చిన ఇది చాలా ఆరోగ్య వంతమైనది పేర్కొన్నారు హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ క్యులినరీ ఆపరేషన్స్ అసోసియేట్ రోనికా సేథ్.

ప్రజలు కోరితే మేము మరిన్ని వంటకాలను మెనులో జోడిస్తామన్నారు. ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలతో ప్రజలు సంతోషంగా ఉన్నందున.. క్యాంటీన్లలో చేసిన మార్పులకు ఇప్పటివరకు మంచి స్పందన వచ్చిందన్నారు. వాస్తవానికి, మాకు ప్రతిరోజూ వంటకాల కొరత ఉందన్నారు రోనికా సేథ్.  మిగతా మంత్రిత్వ శాఖల క్యాంటీన్లలో కూడా ఇలాంటి మార్పులు తీసుకురావాలని యోచిస్తున్నట్లు సేథ్ తెలిపారు. ముఖ్యంగా, కేంద్ర ఆరోగ్య మంత్రి స్వయంగా ఫిట్‌నెస్ ఔత్సాహికులు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తారని ఆమె తెలిపారు. రోజూ 45 నిమిషాల పాటు వ్యాయామం, యోగా చేస్తుంటారన్నారు.

ఇవి కూడా చదవండి: 

వివాహ బంధంతో ఒక్కటికానున్న యంగ్ పొలిటీషియన్స్

కరోనా ఆంక్షలపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ