వివాహ బంధంతో ఒక్కటికానున్న యంగ్ పొలిటీషియన్స్

వివాహ బంధంతో ఒక్కటికానున్న యంగ్ పొలిటీషియన్స్

ఆర్య రాజేంద్రన్.. తిరువనంతపురం మేయర్. సచిన్ దేవ్.. బలుస్సేరి నియోజకవర్గ ఎమ్మెల్యే. కేరళలో అతి చిన్న వయసులోనే మేయర్, ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టిన రికార్డు వీరి సొంతం. సీపీఐ పార్టీకి చెందిన ఈ ఇద్దరు ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఆర్య, సచిన్ దేవ్లు త్వరలోనే వివాహబంధంతో ఒక్కటవ్వనున్నారు. ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారు. 

ఆర్య రాజేంద్రన్, సచిన్ దేవ్లు చిన్నప్పటి నుంచి ఎస్ఎఫ్ఐలో సభ్యులుగా ఉన్నారు. అలా మొదలైన వారి పరిచయం తొలుత స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని పెద్దలకు చెప్పారు. వారు కూడా అంగీకరించడంతో త్వరలోనే ఓ ఇంటివారు కానున్నారు. పెళ్లి ముహూర్తం ఇంకా ఫిక్స్ కావాల్సి ఉంది. 

21 ఏళ్లకే మేయర్ పదవి చేపట్టిన ఆర్య రాజేంద్రన్ దేశంలోనే అతి చిన్న వయస్కురాలైన మేయర్గా రికార్డు సృష్టించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ, సీపీఐ ఏరియా కమిటీ సభ్యురాలుగా ఉన్న ఆమె తిరువనంతపురంలోని ఆల్ సెయింట్స్ కాలేజీలో చదువుకున్నారు. కాలేజీలో ఉండగానే ఆర్య తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ 100లో 52 వార్డుల్లో విజయ ఢంకా మోగించడంతో ఆర్యను మేయర్ పదవి వరించింది. ఇక సచిన్ దేవ్ విషయానికి వస్తే ఎస్ఎఫ్ఐ స్టేట్ సెక్రటరీగా ఉన్న ఆయన 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం తరఫున బలుస్సేరి నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. 20,000 మెజార్టీతో గెలుపొందాడు. 15వ కేరళ అసెంబ్లీలో అడుగుపెట్టిన అతి చిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించాడు. సచిన్ కోజికోడ్‌ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి ఇంగ్లీష్‌లో డిగ్రీ, కోజికోడ్‌ ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి ఎల్ఎల్‌బీ చేశారు.

For more news..

ఎమ్మెల్యే రాజాసింగ్కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు

మేడారంలో దర్శనానికి రెండుగంటలు..!!