ఎమ్మెల్యే రాజాసింగ్కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు

ఎమ్మెల్యే రాజాసింగ్కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చిక్కుల్లో పడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ ఓటర్లను బెదిరించారన్న ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. యూపీ ప్రజలను బెదిరిస్తూ రిలీజ్ చేసిన వీడియోపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 

యూపీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో యోగి రాకతో ఉత్తర్ప్రదేశ్లో గూండారాజ్ అంతమైందని.. కొందరు గూండాలు రాష్ట్రం విడిచి పారిపోతే, మరికొందరు జైలు ఊచలు లెక్కపెడుతున్నారని అన్నారు. యూపీలో ఈసారి కూడా యోగి ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. యోగి, బీజేపీని వ్యతిరేకించే వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. యోగికి జై కొట్టకపోతే జేసీబీలు, బుల్డోజర్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. 

మరిన్ని వార్తల కోసం..

బీజేపీకి ఓటేసి తప్పు చేశాం

మేడారంలో దర్శనానికి రెండుగంటలు..!!