యురిలో భారీగా ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్వాధీనం

యురిలో భారీగా ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్వాధీనం

జమ్ము కశ్మీర్‌లోని యురిలో పోలీసులు ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌ రాకెట్‌ గుట్టు రట్టు చేశారు. అక్కడ భారీగా ఆయుధాలను, మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలను అమ్ముతున్న ఇద్దరిని అరెస్టు చేశారు. ఆ ఇద్దరిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ మహిళ ఇంటికి సమీపంలోని ఒక ఆవుల పాకనుంచి భారీగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.