శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నది పరివాహకంలోని ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని వదలడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు  23వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.  శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం 808.9 అడుగులుగా ఉంది. 

ఇప్పటి వరకు జూరాలకు 40 వేలక్యూసెక్కుల వరదనీరు చేరింది. జూరాల పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా .. ప్రస్తుతం 8.750 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో మూడు యూనిట్లలో 117 మెగావాట్ల విద్యుత్.. దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో మూడు యూనిట్లలో  120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.