హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్లోని  పలు ప్రాంతాల్లో వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. జూన్ 27 మంగళవారం సాయంత్రం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని  సుచిత్ర, కొంపల్లి, బాహుదూర్ పల్లి, సురారం, జీడిమెట్ల, షాపూర్ నగర్, చింతల్, గాజుల రామరం వంటి ప్రాంతాల్లో వాన పడింది. వర్షం కారణంగా ప్రధాన కూడళ్లల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. భారీ వర్షంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. 

ALSO READ:ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు చరణ్ ఫ్యాన్స్ సపోర్ట్.. అందరం కలిసి చెల్లి పెళ్లి చేద్దాం