పండగపూట గుర్రమెక్కిన బాలయ్య

పండగపూట గుర్రమెక్కిన బాలయ్య

ఏపీలో సంక్రాంతి సంబురాలు ఏ రేంజ్‎లో జరుగుతాయో చెప్పక్కర్లేదు. సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు, బసవన్నల ఆటలు, కొత్త అల్లుళ్లతో ఇండ్లన్నీ కళకళలాడుతుంటాయి. మరో పక్క పందెం కోళ్లతో పందెం రాయుళ్లు తెగ బిజీగా గడుపుతుంటారు. ఇలా ఏపీ మొత్తం ఈ మూడు రోజులు పండుగ వాతావరణంతో తొణికిసలాడుతుంది. ఇదే తరహాలో నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా తన కుటుంబసభ్యులతో కలిసి సంక్రాంతి పండుగ వేడుకలు జరుపుకుంటున్నారు. బాలయ్య సోదరి దగ్గుబాటి పురందేశ్వరి, వెంకటేశ్వర రావుల ఇంట్లో పండుగ వేడుకలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బాలయ్య బాబు బసవన్నలు తీసుకొచ్చిన గుర్రమెక్కారు. ఆ గుర్రం కూడా వారు చేస్తున్న డప్పు చప్పుళ్లకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంది. పీఆర్వో వంశీ శేఖర్ ట్వీట్ చేసిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది.

For More News..

కోడి పందెంలో ఓడిన కోడి ధర ఎంతో తెలుసా..

టీ-20 వరల్డ్ కప్‎పై ఐసీసీ కీలక ప్రకటన

సైబర్ ఎటాక్.. పనిచేయని ప్రభుత్వ వెబ్ సైట్లు