సైబర్ ఎటాక్.. పనిచేయని ప్రభుత్వ వెబ్ సైట్లు

సైబర్ ఎటాక్.. పనిచేయని ప్రభుత్వ వెబ్ సైట్లు

ఉక్రెయిన్ లో భారీ సైబర్ దాడి జరిగింది. ప్రభుత్వానికి చెందిన అనేక కీలక వెబ్ సైట్లు పనిచేయకుండా పోయాయి. ఈ సైబర్ ఎటాక్  తో ఉక్రెయిన్ విదేశాంగ, విద్యా, కేబినెట్ శాఖల వెబ్ సైట్లు మూతపడ్డాయి. రాత్రికి రాత్రే జరిగిన ఈ దాడి కారణంగా సైట్లు డౌన్ అయ్యాయని.. నిపుణులు ఐటీ వ్యవస్థను పునరుద్ధరించే పనిలో ఉన్నారు. సైబర్ దాడిపై దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు ఉక్రెయిన్ అధికారులు. మరోవైపు ఈ దాడికి ఇంతవరకు ఎవరూ బాధ్యత తీసుకోలేదు. అయితే హ్యాకర్లు.. విదేశాంగశాఖ వెబ్ సైట్ లో ఉక్రెనియన్ల వ్యక్తిగత సమాచారం మొత్తం తొలగించాం.. దాన్ని తిరిగి పొందడం అసాధ్యం అంటూ ఓ అలర్ట్ డిస్ ప్లే చేశారు. తర్వాత సైబర్ అటాక్ చేశారు. రష్యా.. అమెరికా, నాటో  కూటమి దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో సైబర్ దాడి జరగడంపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది ఉక్రెయిన్. ఇది రష్యాకు చెందినవారే చేశారంటూ ఉక్రెయిన్ ఆరోపణలు చేసింది. 

ఇవి కూడా చదవండి:

అడవిలో ఆహారం దొరక్క  చెత్తలో వెతుకుతున్నాయి

ఢిల్లీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి