తల్లి కోసం ఖర్చు పెట్టడం గృహ హింస కాదు.. ముంబై సెషన్స్ కోర్టు వెల్లడి

తల్లి కోసం ఖర్చు పెట్టడం గృహ హింస కాదు.. ముంబై సెషన్స్ కోర్టు వెల్లడి

ముంబై :  భర్త అతని తల్లి కోసం సమయం, డబ్బు ఖర్చు చేయడం గృహ హింస కిందకు రాదని ముంబై సెషన్ కోర్టు స్పష్టం చేసింది. డొమెస్టిక్ వయలెన్స్ కింద తన భర్తతో పాటు అత్త, మామలపై చర్యలు తీస్కోవాలన్న ఓ మహిళ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఆమె వాదనలు నమ్మలేని విధంగా ఉన్నాయని, ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్​ను కొట్టేసింది. కాగా, తల్లి మానసిక ఆరోగ్యం బాలేదనే విషయం దాచి తనను పెళ్లి చేసుకున్నాడని మహారాష్ట్ర సెక్రటేరియట్​ఎంప్లాయీ అయిన మహిళ తన భర్తపై ఆరోపణలు చేసింది. తాను ఉద్యోగం చేయడం అత్తకు ఇష్టంలేదని, తరచూ తనతో గొడవ పడేదని పేర్కొంది. భర్త విదేశాల్లో ఉద్యోగం చేశాడని, ఇక్కడికి వచ్చినప్పుడు ఉన్న టైమంతా ఆమెతోనే గడిపేవాడని చెప్పింది. వాళ్ల వేధింపుల వల్లే విడాకులు కోరుతూ 2014లో పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొంది.